సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ట్విట్టర్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సమాచారం చేరవేసేందుకు, అభిమానులు- ఫాలోవర్లతో టచ్ లో ఉండేందుకు, ప్రమోషన్స్ కోసం ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ని విరివిగా ఉపయోగిస్తుంటారు. ప్రముఖ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి. గతంలో ట్విట్టర్ కు వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు దానికోసం నెలకు ఇంతని సొమ్ము చెల్లించాలని చెప్పారు. అంతేకాకుండా 3 రకాల బ్యాడ్జులను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ పాలసీ ఇండియాలో అధికారింగా లాంఛ్ అయ్యింది. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
ట్వట్టర్ బ్లూ టిక్ కోసం నెలవారీ చందా చెల్లించాలని ట్విట్టర్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇంగ్లాండ్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లో ఈ సబ్ స్క్రిప్షన్ పాలసీ అమలులో ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఈ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ పాలసీని లాంఛ్ చేశారు. ఈ ట్విట్టర్ బ్లూ బ్యాడ్జ్ పొందేందుకు మీరు నెలకు రూ.900 కట్టాలని తెలియజేశారు. అంతేకాకుండా మీరు ఈ బ్లూటిక్ ఎలా తీసుకోవాలి? తీసుకోవడం వల్ల మీకు కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలను స్పష్టంగా తెలియజేశారు.
మీ అకౌంట్ క్రియేట్ చేసి 90 రోజులు దాటిన తర్వాత బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ పొందేందుకు వీలుంటుంది. కనీసం మూడు నెలల దాటిన తర్వాతే మీరు బ్లూటిక్ పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు ట్విట్టర్ మీ మొబైల్ నంబర్ ను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అలా వెరిఫై చేసుకుంటే మీరు ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ పొందేందుకు వీలుంటుంది. అలా వెరిఫై చేసుకున్న వాళ్లు మీ మొబైల్ యాప్ లో ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేస్తే.. ట్విట్టర్ బ్లూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత సబ్ స్క్రైబ్ చేసుకునేందుకు నెలకు రూ.900 కట్టండని చూపిస్తుంది. మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీ రిక్వెస్ట్ రిసీవ్ అవుతుంది. ఆ సమయంలో మీరు మీ నేమ్, ప్రొఫైల్ పిక్చర్, యూజర్ నేమ్ లాంటివి ఛేంజ్ చేయడం కుదరదు. అలా చేస్తే మీ వాలిడేషన్ రిక్వెస్ట్ క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి రివ్యూ చేసిన తర్వాత మీ అకౌంట్ కు బ్లూ టిక్ లభిస్తుంది.
ఈ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల సాధారణ యూజర్ల కంటే కూడా సబ్ స్క్రైబర్స్ కు కొన్ని ఎక్స్ క్లూజివ్ సదుపాయాలు ఉంటాయి. ట్విట్టర్ నుంచి కొన్ని యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న లిమిటెడ్ క్యారెక్టర్స్ కాకుండా సబ్ స్క్రైబర్స్ కు లాంగ్ ట్వీట్లు పెట్టేందుకు ఛాన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా ట్వీట్ ఎడిట్ చేసే సదుపాయం కూడా ఉంటుంది. ట్వీట్ చేసిన తర్వాత అరగంట సమయంలో ఐదుసార్లు వరకు ఎడిట్ చేసేందుకు వీలుంటుంది. ట్విట్టర్ నుంచి భవిష్యత్ లో వచ్చే అప్ డేట్స్, ఫీచర్లకు కూడా వీరికి ఎర్లీ యాక్సెస్ ఉంటుంది. స్కామ్స్, స్పామ్స్ ఫైట్ చేసే విషయంలో బ్లూ బాడ్జ్ ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే నెలకు రూ.900 నిర్ణయించడంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంత పెట్టడం మరీ ఎక్కువ అంటూ అభిప్రాయపడుతున్నారు.
Twitter Blue 💙 launched in India at ₹900/month.
Now there will be a flood of Blue Tick Accounts on Twitter 😳 pic.twitter.com/2Od4BxKRfn— Nationalist Mumbaikar 🇮🇳™ | (@Ayush_Shah_25) February 9, 2023