టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ అనేది ఒక పెను సంచలనం అనే చెప్పాలి. ఈ చాట్ జీపీటీ సాయంతో సమాచారాన్ని సేకరించడమే కాదు.. డబ్బు సంపాదన కూడా సాధ్యమని చెబుతున్నారు. అయితే చాట్ జీపీటీ సాయంతో డబ్బు సంపాదిస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు.
ఓపెన్ ఏఐ తయారు చేసిన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ చాట్ బాట్ చాట్ జీపీటీ గురించి అందరికీ తెలుసు. గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఈ చాట్ బాట్ ఎన్నో సంచలనాలు సృష్టించింది. మీరు అడిగే ప్రశ్నలకు సాధారణ మనిషి మాదిరిగానే ఈ చాట్ బాట్ కమ్యునికేట్ చేయడం విశేషం. మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ బింగ్ లేటెస్ట్ వర్షన్ లో ఈ చాట్ జీపీటీని ఇన్ క్లూడ్ చేసింది. ఈ చాట్ జీపీటీతో చాట్ చేసేందుకు ఇప్పటికే పెద్దఎత్తున క్యూ కూడా ఉంది. తాజాగా చాట్ జీపీటీ 4 కూడా విడుదలైంది. ఈ చాట్ జీపీటీకి సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉంది. భారత్ లో అయితే నెలకు రూ.1600 వరకు చెల్లించి మీరు చాట్ జీపీటీ, చాట్ జీపీటీ 4 సర్వీసెస్ ని వాడుకోవచ్చు.
అయితే ఈ చాట్ జీపీటీ ఎందుకు ఇంత పాపులర్ అయ్యింది అంటే.. ఇది మీకు కావాల్సిన దాదాపు అన్ని విషయాలకు సంబంధించి సమాచారం అందిస్తుంది. అంతేకాకుండా జీవితంలో, వ్యాపారం పరంగా మీరు ఎదిగేందుకు ఎన్ని ఐడియాస్ కావాలో, ఎలాంటి గైడెన్స్ కావాలో కూడా ఈ చాట్ జీపీటీ తెలియజేస్తుంది. అంతేకాకుండా మీ పర్సనల్ గైడ్ గా కూడా ఉంటుంది. ఇప్పటికే ఈ చాట్ జీపీటీని వినియోగించుకుని డబ్బు సంపాదించడం కూడా ప్రారంభించారు. చాట్ జీపీటీ చెప్పిన ఐడియాస్ వారికి సూట్ అయ్యే కొన్ని ఐడియాస్ ని తీసుకుని ఎర్నింగ్ స్టార్ట్ చేశారు. ఒక తెలుగు టెక్ యూట్యూబర్ దానికి సబంధించి ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు.
చాట్ జీపీటీ సాయంతో అతను రోజుకి రూ.2000కు పైగా సంపాదించినట్లు చెప్పాడు. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఆధారాలను కూడా వీడియోలో పోస్ట్ చేశాడు. అతను చాట్ జీపీటీని పెట్టుబడి లేని బిజినెస్ ఐడియాస్ ని అడిగాడు. అందులో అఫ్లియేట్ మార్కెట్ కి సంబంధించి ఎలా డబ్బు సంపాదించాలో కోరాడు. చాట్ జీపీటీ చెప్పిన కొన్ని యాప్స్ లో ఒక దానిని ఎంచుకున్నాడు. ఒక ఫేమస్ ఇన్ స్టాగ్రామ్ మీమ్ పేజ్ ని మాట్లాడుకున్నాడు. అతను చెప్పిన దాని ప్రకారం టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి 5 వేల వరకు ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అఫ్లియేట్ లింక్స్ ని ప్రమోట్ చేశాడు. అందులో వచ్చిన క్లిక్స్ ద్వారా మొత్తం నాలుగు రోజులకు రూ.8 వేల వరకు సంపాదించాడు. చాట్ జీపీటీతో డబ్బు సంపాదన సాధ్యమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.