చాట్ జీపీటీకి పోటీ అంటూ గూగుల్ తీసుకొస్తున్న బార్డ్ ఆల్ఫాబెట్ కంపెనీ కొంప ముంచింది. టెస్టింగ్ లో చేసిన ఒక చిన్న తప్పు ఇప్పుడు ఆ కంపెనీకి లక్షల కోట్లలో నష్టం తెచ్చిపెట్టింది. గూగుల్ మాత్రం టెస్టింగ్ కొనసాగించి అభివృద్ధి చేస్తామంటోంది.
ప్రస్తుతం అంతా ఏఐ టెక్నాలజీ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొత్త పుంతలు తొక్కుతున్న ఈ సాంకేతికత మానవజీవితాన్ని సులభతరం చేసేందుకు ఉపయోగపడుతుంది అంటూ చెబుతున్నారు. అయితే ఈ ఏఐ వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయని ఎంతోమంది వాదిస్తున్నారు కూడా. ప్రస్తుతం ఏఐకి సంబంధించి చాట్ జీపీటీ పేరు బాగా వినిపిస్తోంది. అయితే దానికి పోటీగా గూగుల్ సంస్థ సరికొత్త చాట్ బాట్ అంటూ బార్డ్ ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బార్డ్ చాట్ జీపీటీకి పోటీ ఇస్తుందంటూ చెబుతున్నారు. కానీ, ఈ బార్డ్ వల్ల మొదటికే మోసం వచ్చినట్లు తెలుస్తోంది. బార్డ్ వల్ల గూగుల్ పేరిటింగ్ కంపెనీకి లాభాలు సంగతి పక్కన పెడితే.. ఏకంగా రూ.8 లక్షల కోట్లు నష్టం తెచ్చిపెట్టింది.
చాట్ జీపీటీకి పోటీ అంటూ భావిస్తున్న ‘గూగుల్ బార్డ్’ ఇప్పుడు పెద్దఎత్తున వార్తల్లో నిలిచింది. అయితే అది పాజిటివ్ గా కాదులెండి. ఈ గూగుల్ బార్డ్ కచ్చితంగా చాట్ జీపీటీకి పోటీ ఇస్తుందంటూ చాలా మంది భావించారు. కానీ, గూగుల్ బార్డ్ వల్ల యూజర్ల సంగతి పక్కన పెడితే దాని పేరెంటింగ్ సంస్థ ఆల్ఫాబెట్ ఏకంగా లక్షల కోట్లలో నష్టం వాటిల్లింది. ఓ ప్రశ్నకు బార్డ్ ఇచ్చిన తప్పు సమాచారం ఆల్ఫాబెట్ కంపెనీకి 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. బుధవారం ఆ కంపెనీ షేర్లు 7 శాతం మేర క్రాష్ అయ్యాయి. గురువారం కూడా 4 శాతం నష్టాల్లో ఓపెన అయ్యాయి. అలా మొత్తం ఆల్ఫాబెట్ కంపెనీకి దాదాపు 100 బిలియన్ డాలర్ల మేర నష్టం వచ్చింది.
Google’s Bard AI chatbot had a wrong answer on a marketing image and Google lost $100 billion in market value today as a result. The market is worried Google is behind Microsoft after a lackluster AI event today. The AI search war is truly on pic.twitter.com/XIMB1TeKrT
— Tom Warren (@tomwarren) February 9, 2023
అసలు ఆ బార్డ్ చెప్పిన తప్పు సమాధానం ఏంటంటే.. తొమ్మిదేళ్ల పిల్లలకు తెలియజేసేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలీస్కోప్ కొత్తగా ఏం గుర్తించింది? అనే ప్రశ్నకు బార్డ్ పలు రకాల సమాధానాలు చెప్పింది. వాటిలో భూమికి వెలుపల సోలార్ సిస్టమ్ మొట్ట మొదటి ఫొటో తీసిన శాటిలైట్ జేడబ్ల్యూఎస్ టీ అనే సమాధానం కూడా ఉంది. అయితే నిజానికి 2004లో యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్జ్ టెలీస్కోప్ ఈ చిత్రాన్ని తీసింది. ఈ విషయాన్ని స్వయంగా నాసానే నిర్థారించింది కూడా. బార్డ్ చెప్పిన ఈ సమాధానమే ఇప్పుడు వారికి తిప్పలు తెచ్చిపెట్టింది. ఈ తప్పుతో ప్రస్తుతం మొత్తం బార్డ్ ప్రదర్శనపైనే అనుమానాలు వినిపిస్తున్నాయి.
అయితే గూగుల్ మాత్రం ఈవారం మరోసారి టెస్టింగ్ ప్రాసెస్ ప్రారంభిస్తామని చెప్పింది. కంపెనీలో అంతర్గతంగా జరిగే టెస్టింగ్ మాత్రమే కాకుండా.. బయట నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ని కూడా పరిగణలోకి తీసుకుని డెవలప్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టెక్ కంపెనీలు ఏఐ టెక్నాలజీ మీదే దృష్టి సారిస్తోంది. బడా బడా కంపెనీలు ఈ సాంకేతికతతో పనిచేసే యాప్స్, బ్రౌజర్లపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ రేసులో ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, గూగుల్ పోటీ పడుతున్నాయి. చాట్ జీపీటీ విషయంలో మైక్రోసాఫ్ట్ కూడా ఎంతో కృషి చేస్తోంది. మరోవైపు ఏఐ సైబర్ సెక్యూరిటీ డెవలప్ పై కూడా చర్చ మొదలైంది.
Google lost over $100 billion in market value. None of the googlers saw the mistake in their promotional video of Bard. (3*JWST)
Satya Nadella said we will make them dance and Microsoft is actually making Google dance. Partnership with OpenAI seems like their best investment yet. pic.twitter.com/hwWDYp1u9X— Harshit Verma (@harshit1verma) February 9, 2023