ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కంపెనీ గురించి పరిచయం అవసరం లేదు. ఇండియాలో ఈ సంస్థకి రెండు ప్లాంట్స్ ఉన్నాయి. ఇన్నాళ్ల నుండి ఇక్కడ ఫోర్డ్ కంపెనీ కార్ల తయారీ జరుగుతూ ఉంది. అయితే.. ఇప్పుడు ఫోర్డ్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది.ఇండియాలో ఆ సంస్థ ఇక కార్ల తయారీని నిలిపి వేయనున్నట్టు ప్రకటించింది. దీంతో.. ఇండియాలో ఉన్న ఆ సంస్థ రెండు ప్లాంట్స్ షట్ డౌన్ కానున్నాయి.
ఇండియాలో తయారీ కేంద్రాలను కొనసాగించడం తలకి మించిన భారం అవ్వడం వల్లనే ఫోర్డ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్లాంట్స్ షట్ డౌన్ చేస్తున్నప్పటికీ..ఈ యూఎస్ ఆటోమేకర్ ఇండియాలో కొన్ని మోడళ్ల కార్స్ ని అమ్మడానికి సిద్దంగానే ఉన్నట్టు సమాచారం. అయితే.., ఇవన్నీ ఇంపోర్ట్ ద్వారా కొనాల్సి ఉంటుంది. దీని కారణంగా.. ఇండియన్స్ కి ఫోర్డ్ కార్స్ కాస్ట్ మరింత భారం కానుంది.
ఇండియాలో తమ రెండు పాయింట్స్ షట్ డౌన్ అవుతున్నా.., వినియోగదారులకు సర్వీస్ కి అంతరాయం లేకుండా ఫోర్డ్ కంపెనీ చర్యలు తీసుకోబోతుంది. ఇక.. ఫోర్డు కన్నా ముందుగా జనరల్ మోటార్స్, హార్లే డేవిడ్సన్ వంటి కంపెనీలు కూడా నష్టాల కారణంగా ఇండియాలో ఉత్పత్తులను ఆపేసిన విషయం తెలిసిందే.