ట్విట్టర్ ఖాతాదారులకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ట్విట్టర్ బ్లూ అని షాకిచ్చారు. ఇప్పుడు అందరికీ గట్టి షాక్ తగిలే ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఎలన్ మస్క్ నిర్ణయం ప్రకారం లక్షల్లో ఖాతాలు గల్లంతైపోతాయి.
ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత పెను మార్పులు జరిగాయి. ఉద్యోగాల కోత మొదలు.. ఆఫీసులు మూసివేత వరకు ఎన్నో సంచనల నిర్ణయాలు తీసుకున్నారు. యూజర్లకు కూడా ట్విట్టర్ బ్లూ పేరిట షాకిచ్చిన విషయం తెలిసిందే. మీకు వెరిఫైడ్ అకౌంట్ కావాలి అంటే నెలకు రూ.650 కట్టాల్సిందే. మస్క్ ని చూసి మార్క్ జుకర్ బర్గ్ కూడా ఇన్ స్టాగ్రామ్ వెరిఫైడ్ అకౌంట్ కోసం నెలవారీ చందా పాలసీలోకి వచ్చేశాడు. కాకపోతే ఇంకా ఇండియాలో ప్రవేశ పెట్టలేదు. మస్క్ ఏం చేసినా సంచలనం, ఏం మాట్లాడినా న్యూస్ అవ్వాల్సిందే. తాజాగా మరోసారి ట్విట్టర్ ఖాతాదారులకు షాకివ్వబోతున్నాడు.
ట్విట్టర్ ఖాతాలు చాలా మందికి ఉన్నాయి. కాకపోతే అందరూ తమ ట్విట్టర్ ఖాతాలను తరచుగా వాడరు. కొందరైతే కొన్ని నెలలపాటు తమ ట్విట్టర్ ఖాతాని అసలు లాగిన్ కూడా చేయరు. అలాంటి యూజర్లకు ఇప్పుడు పెద్ద షాకే తగిలేలా ఉంది. ఎందుకంటే ఎలన్ మస్క్ ఇన్ యాక్టివ్ ట్విట్టర్ ఖాతాల విషయంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడుతున్నాడు. ఆ నిర్ణయం పాస్ అయితే చాలా మంది ట్విట్టర్ ఖాతాలు ఎగిరిపోతాయి. ఆ రూల్ ప్రకారం మీరు మీ ట్విట్టర్ ఖాతాని 30 రోజుల గనుక లాగిన్ చేయకపోతే అది డీయాక్టివ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు మీ ట్విట్టర్ ఖాతాను పూర్తిగా వాడే అవకాశం ఉండదు.
ఇందుకు సంబంధించి స్వయంగా ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. “కొన్ని సంవత్సరాలుగా ట్విట్టర్ యాక్టివ్ గా లేని ఖాతాలను మేము తొలగిస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చారు. ఈ లెక్కన చాలా మంది ఖాతాలు ఎగిరిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది ఖాతాలను ఓపెన్ చేసి వదిలేస్తుంటారు. అలాంటి వారు వారి ఖాతాలను కోల్పోతారు. సెలబ్రిటీల్లో దీపికా పదుకొణె ఖాతా పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే దీపికా పదుకొణె ఫిబ్రవరి 2021 తర్వాత ట్విట్టర్ యాక్టివ్ గా లేదు. ఆమెకు ట్విట్టర్ లో 27 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరి.. ఈ నిర్ణయంతో దీపికా పదుకొణె ఖాతా ఆర్కైవ్ అవుతుందా? లేదా? అనేది తెలియదు. సెలబ్రిటీల ఖాతాల విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాన్నే అమలు చేస్తారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎలన్ మస్క్ తీసుకోనున్న ఈ నిర్ణయం సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.