భారత్ మార్కెట్ లో రెడ్ మీ కంపెనీకి చెందిన ప్రొడక్టులకు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. స్మార్ట్ ఫోన్ తర్వాత రెడ్ మీ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు భారత మార్కెట్ లోకి రెడ్ మీ సరికొత్త స్మార్ట్ టీవీని లాంఛ్ చేస్తోంది.
రెడ్ మీ కంపెనీకి భారతదేశంలో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ప్రొడక్ట్ కి ఇండియన్ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోనే కాకుండా స్మార్ట్ టీవీల తయారీలోనూ దూసుకుపోతోంది. ఇప్పుడు రెడ్ మీ తాజాగా ఒక స్మార్ట్ టీవీని లాంఛ్ చేయబోతోంది. అయితే అందులో స్పెషల్ ఏముంది అంటారా? ఆ సరికొత్త స్మార్ట్ టీవీ ఫైర్ ఓఎస్ 7 సాయంతో పనిచేస్తుంది. అవును మీరు గెస్ చేసింది కరెక్టే.. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ ఫైర్ ఓఎస్ 7 సాయంతో పనిచేస్తుంది. మరి.. ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్, లాంఛింగ్ డేట్ ఎప్పుడనేది చూద్దాం.
ఇండియన్ మార్కెట్ లో మరో స్మార్ట్ టీవీ లాంఛ్ చేసేందుకు రెడ్ మీ సన్నాహాలు చేస్తోంది. ఈ టీవీలో ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఫైర్ టీవీ. ఈ స్మార్ట్ ఫైర్ ఓఎస్ 7 ఆధారంగా పని చేస్తుంది. ఈ విషయాన్ని అమెజాన్ ద్వారా రెడ్ మీ కన్ఫమ్ చేసింది. ఈ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే.. పెద్దగా బయటకు చెప్పలేదు. కానీ, కొన్ని ప్రధాన ఫీచర్స్ ను మాత్రం రివీల్ చేశారు. ఈ ఫైర్ ఓఎస్ 7 వల్ల ప్రీమియం ఎక్స్ పీరియన్స్ లభిస్తుందని చెబుతున్నారు. ఇందులో స్మార్ట్ హోమ్ కంట్రోల్ హబ్ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీలో అలెక్సా కూడా వర్క్ చేస్తుంది. దాదాపుగా అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ యాప్స్ ని సపోర్ట్ చేస్తుంది.
Reinvent your smart tv experience with the all-new #RedmiSmartFireTV.
Watching your favorite entertainment shows will now be fiery than ever!
Launch on 14.03.2023, 12PM
Know more: https://t.co/qNUCPqnIv5#FireUp pic.twitter.com/iz5g7O2lNl— Xiaomi TV India (@XiaomiTVIndia) March 3, 2023
ఇంక బాడీ విషయానికి వస్తే.. ఈ రెడ్ మీ ఫైర్ టీవీ బాజిల్ లెస్ మెటాలిక్ డిజైన్ లో రాబోతోంది. ఇందులో ప్యూచరిస్టిక్ కనెక్టవిటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే.. ఎయిర్ ప్లే, మిరాకాస్ట్, బ్లూటూత్ 5.0, డ్యూయల్ బాండ్ వైఫై వంటి కనెక్టింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీని లాంఛింగ్ డేట్ వచ్చి మార్చి 14న ఉంటుందని అధికారకంగా ప్రకటించారు. అయితే ధర విషయం మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ప్రైస్ విషయంలో ఎలాంటి హింట్స్ కూడా ఇవ్వలేదు. కచ్చితంగా ప్రీమియం ప్రైస్ రావచ్చని అభిప్రాయాలను వినిపిస్తున్నాయి. లాంఛ్ చేసిన రోజు నుంచే బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించే అవకాశం కూడా ఉంది. ఈ రెడ్ మీ ఫైర్ టీవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
New Redmi Smart TV with Fire OS 7 launching in India on March 14.#Xiaomi #Redmi pic.twitter.com/BhEHgNUcZt
— Mukul Sharma (@stufflistings) March 3, 2023