మండే ఎండాకాలం రానే వచ్చింది. అప్పుడే భానుడి భగ భగలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో చాలా మంది ఏసీలు కొనాలి అని చూస్తారు. కానీ, ఈ టైమ్ లో ఏసీలు బాగా ప్రియంగా ఉంటాయి. కానీ, ఇప్పుడు ఏసీలపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
సమ్మర్ రానే వచ్చింది. ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. ఏసీలు కొనాలి అని చాలా మంది చూస్తుంటారు. అయితే సమ్మర్ మొదలయ్యాక ఏసీలు కొనడం అంటే కాస్త ఖరీదైన విషయమనే చెప్పాలి. ఎండాకాలంలో ఆటోమేటిక్ గా ఏసీల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఏసీలు కొనాలి అనుకునేవారికి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే ఫ్లిప్ కార్ట్ సమ్మర్ స్పెషల్ గా ఎలక్ట్రానిక్స్ పై డిస్కౌంట్ సేల్ ఒకటి ప్రారంభించింది. ఈ సేల్ లో బెస్ట్ ఏసీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. ఆ సేల్ లో బెస్ట్ ఏసీలు ఏ ధరలో ఉన్నాయి? వాటిపై ఎంత డిస్కౌంట్లు లభిస్తున్నాయో చూద్దాం. ఫిబ్రవరి 24 నుంచి ఈ నెలాఖరు వరకు ఈ స్పెషల్ సేల్ కొనసాగనుంది.
ఈ సేల్ లో ఒక ఏసీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే అది బెస్ట్ ఏసీ మాత్రమే కాదు.. దానిపై అదిరిపోయే డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి. ఆ ఏసీ మరేదో కాదు.. వాల్ పూల్ కంపెనీకి చెందిన 1.5 టన్ 3 స్టార్ స్ల్పిట్ ఏసీ. దీని ఎమ్మార్పీ రూ.62 వేలుగ కాగా.. 47 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.32,490కే అందిస్తున్నారు. దానికి అదనంగా.. ఐసీసీఐ, యాక్సిస్, ఎస్ బీఐ బ్యాంక్ కార్డ్స్ పై రూ.2,500 వరకు తగ్గింపు కూడా ఉంది. పీఎన్ బీ బ్యాంక్ వారికి అదనంగా రూ.1,500 డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈఎంఐ వెసులుబాటు కూడా ఉంది.
లాయిడ్ కంపెనీకి చెందిన 1.5 టన్, 3 స్టార్ స్ల్పిట్ ఏసీ. ఇది హాట్ అండ్ కోల్డ్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ. దీని ఎమ్మార్పీ రూ.64,990 కాగా 39 శాతం డిస్కౌంట్ తో రూ.39 వేలకు అందిస్తున్నారు. అయితే దీనిపై వివిధ బ్యాంకులకు సంబంధించిన ఆఫర్లు ఉన్నాయి. ఐసీసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులు కలిగి ఉన్న వారికి అదనంగా రూ.2,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారికి 10 శాతం డిస్కౌంట్ ఉంది. ఈఎంఐ వెసులుబాటు కూడా ఉంది.
వోల్టాస్ కంపెనీ నుంచి కూడా 1.5 టన్ ఏసీపై డిస్కౌంట్ నడుస్తోంది. ఈ వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ ధర రూ.62,990 కాగా దీనిపై రూ.46 శాతం డస్కౌంట్ లభిస్తోంది. అంటే ఏసీ ధర రూ.33,499 అనమాట. దానిపై యాక్సిస్, ఐసీఐసీఐ, ఎస్ బీఐ బ్యాంకు కార్డులు కలిగిన వారికి అదనంగా రూ.2,500 డిస్కౌంట్ లభిస్తుంది. పీఎన్ బీ బ్యాంకు కార్డు కలిగిన వారికి 10 శాతం డిస్కౌంట్ కూడా ఉంది. ఏసీలపై ఉన్న తగ్గింపులు, ఆఫర్లు తెలుసుకునేందుకు ప్లిప్ కార్ట్ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించండి.
Mins ago, it was here,
Mins away it will be gone!Enjoy unbelievable deals and discounts on Godrej ACs at the #FlipkartBigSavingDaysSale@Flipkart @flipkartsupport#Godrej #GodrejAppliances #ThingsMadeThoughtfully #SochKeBanayaHai #Flipkart
Shop Now: https://t.co/9RTr8CWA8y pic.twitter.com/1frxHpjzeM
— Godrej Appliances (@GodrejAppliance) January 19, 2023