కళ్లు తెరిస్తే జననం.. కళ్లు మూస్తే మరణం.. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం అని అంటారు. జనన, మరణాలు మన చేతిలో ఉండవు. ముఖ్యంగా చావు గురించి చెప్పుకుంటే ఈ ప్రపంచంలో అత్యంత అలుపెరుగని నిజం. ఈ సత్యాన్ని ఎవరూ ఖండించలేరు. అదే విధంగా నిరోధించనూ లేరు. శ్రీకృష్ణుడి గీతలో చెప్పినట్లు ప్రతి జీవికి మరణమేది ఉంటుందనేది సత్యం. అయితే ఆ మరణం తర్వాత జీవిలో ఆత్మ వేరొక శరీరంలోకి వెళ్తుంది. ఈ సత్యాన్ని తిరస్కరించలేం.
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మరణం రెండు రకాలు.. సహజ మరణం, అసహజ మరణం. సహజ మరణం అంటే.. శరీరం వృద్ధాప్యంతో అలసిపోయి ఆత్మ బయటకు వెళ్లడంతో సంభవిస్తుంది. అసహజ మరణం అంటే ప్రమాదావశాత్తు సంభవించే ఘటనలు. పాము కాటు, ఆయుధాలు, ఆత్మహత్య ఇలా రకరకాల ప్రమాదాల ద్వారా వచ్చే మరణాలు అసహజమైనవి. ధనవంతులు, పేదవారు అందరికీ మరణం రావడం తథ్యమైనప్పటికీ.. ఒకే విధంగా మాత్రం ఉండదట. ఇది వారు చేసిన కర్మలపై ఆధారపడి ఉంటుందట.
ఇది కూడా చదవండి: సోషల్ మీడియాలో వైరలవుతోన్న ‘గుండు’ బాస్ కథ!
ఇపుడు ఇవన్నీ ఎందుకంటారా?. మనిషి ఎలా చనిపోయినా.. చావడానికి 30 సెకెన్ల ముందు వారి మరణం గురుంచి వారికి తెలుస్తుందట. మరణానికి కొన్ని సెకన్ల ముందు ఒక వ్యక్తి ఎలా భావిస్తాడు? జీవితానికి, మరణానికి మధ్య చివరి క్షణాలు ఎలా ఉంటాయనే దానిపై కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ అంశంపై యుఎస్‌లోని లూయిస్‌విల్లే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు. మరణానికి 30 సెకన్ల ముందు, మెదడులో ప్రకాశవంతమైన కాంతి మెరుస్తున్నట్లు వారు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు దీనికి ‘లాస్ట్ రీకాల్’ అని పేరు పెట్టారు. అంటే జీవితంలోని చివరి జ్ఞాపకం. అనేక హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రాలలో, శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని చూపించినప్పటకీ.. అది సినిమా కాదయా నమ్మే వాళ్లం కాదు. కానీ వారి పరిశోధనలో వెల్లడైన విషయాలు ఆ ఫిక్షన్ నిజం అయినట్టుగా చూపిస్తున్నాయి.