మనిషికి కళ్లు ఎంతో ప్రధానమైనవి.. అందుకే పెద్దలు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. దేశంలో అప్పుడప్పుడు చిన్న పిల్లలు, పెద్దల కళ్ల నుంచి రక రకాల వస్తువులు, చీమలు వస్తున్నాయని వార్తలు వినిపిస్తుంటాయి.
మనిషికి శరీర భాగంలో అతి ముఖ్యమైనది కళ్లు. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలు అన్నారు. మనిషి కళ్లు ఎన్నో రకాల భావాలు పలికిస్తాయి. కోపం, దుఖఃం, సంతోషం, ప్రేమ, వాత్సల్యం ఇలా ఎన్నో రకాల హావభావాల్ని కళ్లతో పలికిస్తుంటారు. కొంతమందికి సంతోషం, దుఖఃం ఏది వచ్చినా.. కన్నీళ్లు వస్తాయి. అలాంటిది ఓ పాప కళ్ల నుంచి ప్లాస్టీక్ పేపర్లు, బియ్యం గింజలు, పేపరు ముక్కలు, పుల్లలు ఇలా రక రకాల వస్తువులు బయటకు వస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులే కాదు.. చుట్టుపక్కలవాళ్లు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. పాపకు ఏదో వింత జబ్బు వచ్చినట్టుందని అనుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్దకృష్టాపురంలో సౌజన్య అనే చిన్నారికి ఈ వింత సమస్య వచ్చిపడింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే డాక్టర్లు ఈ సమస్య మిస్టరీని ఛేదించారు. వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం రాజోలు గ్రామానికి చెందిన భూక్య దశ్రు-దివ్య దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో చిన్న పాప పేరు సౌజన్య(8). ఈ చిన్నారి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటుంది. స్థానిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతుంది. చిన్నప్పటి నుంచి సౌజన్యకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. గత మూడు నెలల నుంచి సౌజన్య కుడి కన్ను నుంచి బియ్యపు గింజలు, ప్లాస్టీక్ పేపర్లు, పుల్లలు లాంటివి జారిపడుతున్నాయి. సౌజన్య కళ్ల నుంచి వస్తువులు రావడం గ్రామస్థులు ఇదేం వింతరోగం అంటూ చర్చించుకోవడం మొదలు పెట్టారు. దీంతో ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. చికిత్స తర్వాత నాలుగు రోజుల పాటు బాగానే ఉన్నా.. తర్వాత మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతూ వచ్చింది. దీంతో పాపను తల్లిదండ్రులు ఖమ్మం జిల్లా లోని ఓ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.
సౌజన్యను పరీక్షించి.. ఉదయం నుంచి అబ్జర్వేషన్ లో ఉంచారు డాక్టర్లు. మొత్తానికి సౌజన్య ఆరోగ్య మిస్టరీ వీడింది. పాప కన్ను బాగానే ఉందని, ఎలాంటి గాయం కాలేదని చెప్పారు. కళ్ల నుంచి పలు వస్తువులు రావడానికి గల కారణాలు గుర్తించిన డాక్టర్లు.. పాప బిహేవియరల్ అబ్ నార్మాలిటిగా ఉందని తేల్చారు. ఇదంతా పాపకు తెలియకుండానే జరుగుతుందని.. గోర్లు నమిలి కళ్లలో పెట్టుకొని కొద్దిసేపటికి మంట, దురద రావడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తన కంట్లో ఏదో ఉందని చెప్పడం.. కళ్ల నుంచి గోర్లు, బియ్యం గింజల.. అలాగే చిన్న చిన్న వస్తువులు నమిటి కళ్లలో తనకు తెలియకుండా పెట్టుకోవడం వల్ల నొప్పి రావడం జరుగుతుందని.. అప్పుడు తన కళ్ల నుంచి ఏదో వస్తుందని భ్రపడుతుందని డాక్టర్లు తెలిపారు. వాస్తవానికి పాప కళ్ల లో నుంచి అవి రావడం లేదని తేల్చారు. దీనికి ప్రత్యేకమైన మెడిసెన్స్ లేవని.. కాగ్నిటీవ్ బిహేవియరల్ థెరపీ ద్వారా ఈ సమస్యను తగ్గించవొచ్చు.. పాప తల్లిదండ్రుల సహకారంతో.. కౌన్సిలింగ్ ఇస్తూ ఈ సమస్యను దూరం చేసే వీలు ఉంటుందని డాక్టర్లు తెలిపారు.