అశోక్-బేబి దంపతులు. వీరికి సంవత్సరం కిందట వివాహం జరిగింది. ఇక ఏడాది తిరిగే లోపే వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే, పుట్టింట్లో ఉన్న తన భార్యను భర్త ఇంటికి తీసుకు రావాలని అనుకున్నాడు. దీనికి ఆమె నిరాకరించడంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
ఇతని పేరు బనాతో అశోక్. వయసు 24 ఏళ్లు. ఇతనికి గతేడాది కిందట ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇక ఏడాది తిరగక ముందే వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. భార్య బాలింత కావడంతో గత కొన్ని రోజుల నుంచి పుట్టింట్లోనే ఉంటుంది. అయితే, భార్యను తన ఇంటికి తీసుకురావాలని అశోక్ గత కొన్ని రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాడు. ఇటీవల అత్తింటికి వెళ్లి ఇంటికి రావాలంటూ భార్యను కోరాడు. దీనికి ఆమె నిరాకరించినట్లు తెలుస్తుంది. దీంతో తీవ్ర మనస్థానికి గురైన అశోక్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలో మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం పరిధిలోని వెంక్యా తాండ. ఇక్కడే బానోతు అశోక్ (24)-బేబి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఇదిలా ఉంటే, భార్య గర్భవతి కావడంతో 5 నెలల కిందట పుట్టింటికి వెళ్లింది. నాలుగు నెలల కిందట ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చింది. ఇక భార్య పుట్టింటికి వెళ్లి చాలా రోజులు కావడంతో అశోక్ భార్యను ఇంటికి తీసుకురావాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల అత్తింటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక భార్యను తనతో పాటు ఇంటికి రావాలంటూ కోరాడు. దీనికి బేబి నిరాకరించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే తోడి అల్లుడు, వదిన అశోక్ ను దూషించి అవమానించినట్లు తెలుస్తుంది. దీంతో అశోక్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక అతనికి ఏం చేయాలో తెలియక తాజాగా స్థానికంగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దీని కంటే ముందు అశోక్.. తనను తోడి అల్లుడు, వదిన ఘోరంగా అవమానించారని, దీని కారణంగానే నేను బలన్మరణానికి పాల్పడినట్లు అశోక్ సెల్ఫీ వీడియోలు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అశోక్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతుడి సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.