ఆమెకు 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైనే కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక అంతా బాగానే ఉందనుకున్న సమయంలోనే ఆ వివాహిత ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
ఆమె పేరు మౌనిక, వయసు 28 ఏళ్లు. 11 ఏళ్ల కిందటే రాంబాబు అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కొంత కాలానికి ఈ భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే గడిపారు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఉన్నట్టుండి మౌనిక సంచలన నిర్ణయం తీసుకుంది. కూతురు అలా చేయడంతో ఆమె తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పరిధిలోని పకీరతండా. ఇక్కడే రాంబాబు-మౌనిక దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 11 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవించారు. అలా కొన్నేళ్ల తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అలా కొన్ని రోజులు గడిచింది. ఇన్నాళ్లు ప్రేమ, అప్యాయత చూపించిన భర్త, అత్తమామలు.. గత కొన్ని రోజుల నుంచి అదనపు కట్నం తేవాలని వేధించినట్లు సమాచారం.
రాను రాను భర్త వేధింపులు కూడా మరింత ఎక్కువ అవ్వడంతో మౌనిక తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఆ మహిళ ఇద్దరు పిల్లలను కాదని ఇటీవల ఇంట్లో పురుగుల మందు తాగింది. స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో మౌనిక ప్రాణాలు కోల్పోయింది. కూతురి మరణవార్త తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇదిలా ఉంటే.. మృతురాలి తలకు బలమైన గాయం కావడంతో అత్తింటివాళ్లే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై మృతురాలి తండ్రి భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.