ఫకృద్దీన్-ఆశ దంపతులు. వీరికి ఉమర్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. కట్ చేస్తే.. ఉమర్ అనుమానాస్పదస్థితిలో చనిపోయి తల్లిదండ్రులకు కనిపించాడు. మృతుడి తండ్రి బంధువులు మాత్రం తల్లిని అనుమానిస్తున్నారు. అసలేం జరిగిందంటే?
అది ఆదివారం తెల్లవారు జామున 4 గంటల సమయం. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటికి వెళ్లి ఇంటి బయట గేట్ కొట్టారు. ఆ ఇంట్లో నుంచి మహిళ వెంటనే బయటకు వచ్చి గేట్ తీసి చూడగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కింద కనిపించాడు. ఈ సీన్ చూసిన తల్లి ఒక్కసారిగా షాక్ గురైంది. వెంటనే అరుపులు వేయడంతో ఇంట్లో నుంచి ఆమె భర్త వచ్చాడు. కుమారుడిని అలా చూసి తండ్రి తట్టుకోలేకపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ యువకుడు చనిపోయాడని నిర్ధారించారు. దీంతో మృతుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి గ్రామంలో ఎండీ. ఫకృద్దీన్-ఆశ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకి ఉమర్ (20) అనే కుమారుడు జన్మించాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచారు. ఇదిలా ఉంటే.. శనివారం రాత్రి ఉమర్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ రోజు రాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు. ఇక మరుసటి రోజు తెల్లవారుజామున కొందరు వ్యక్తులు వారి ఇంటి గేట్ శబ్దం చేశారు. వెంటనే ఇంట్లో నుంచి ఆశ బయటకు వచ్చి చూడగా.. ఆమె కుమారుడు ఉమర్ తలకు తీవ్రమైన గాయంతో పడిపోయి ఉన్నాడు. కొడుకుని అలా చూసి తల్లి ఒక్కసారిగా పెద్దగా అరిచింది.
వెంటనే భర్త ఫకృద్దీన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కుమారుడిని చూసి షాక్ గురయ్యాడు. హుటాహుటిన ఉమర్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆ యువకుడు చనిపోయాడని తెలిపారు. దీంతో మృతుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ విషయం తెలుసుకుని బంధువులు అంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మృతుడి తండ్రి బంధువులు మాత్రం.. ఉమర్ ను అతని తల్లి ఆశనే చంపేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆందోళనకు కూడా దిగారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.