మృత్యువు ఏ రూపంలో కబలిస్తుంతో ఎవరూ చెప్పలేరు.. అందుకే వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ ఊహించలేరు అని అంటుంటారు.. అప్పటి వరకు మనతో సంతోషంగా తిన
మనిషిని మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈ మద్య కాలంలో చాలా మంది హార్ట్ ఎటాక్ తో కళ్ల ముందే కుప్పకూలి చనిపోతున్నారు. ఇక రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సర్వసాధారణం అయ్యాయి. మరికొంతమంది ప్రకృతి వైపరిత్యాల వల్లనో.. కరెంట్ షాక్ తగిలి చనిపోతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొద్ది గంటల్లో పెళ్లి జరుగనుండగా ఈ రోజు యువకుడు మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో గురువారం తీవ్ర విషాదం నెలకొంది. తెల్లారితే పెళ్లి.. అప్పటికే పెళ్లి కార్డులు అన్నీ పంచేశారు.. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. పెళ్లి పనులు పూర్తయ్యాయి.. బ్యాండ్, డీజేలు సిద్దంగా ఉన్నాయి.. ఇంటి ముందు టెంట్లు వేసి ఇళ్లంతా కోలాహలంగా ఉంది. రేపటి పెళ్లి కోసం అందరూ సిద్దమవుతున్న సమయంలో కరెంటు రూపంలో పెళ్లి కొడుకును మృత్యువు కబలించింది. ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపు వరుడు కన్నుమూశాడు. దీంతో పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. పెళ్లి డప్పులు మోగాల్సిన చోట చావు డప్పు మోగింది. పెళ్లి వేడుక చూడాలని ఆశతో వచ్చిన వారు శవ యాత్రలో పాల్గొనాల్సి వచ్చింది.
జిల్లా పరిధిలోని ఈదులపూసపల్లి.. కొమ్ముగూడెం గ్రామ పంచాయితీకి చెందిన యాకూబ్ అనే యువకుడు, ఇదే జిల్లా గార్ల మండలానికి చెందిన ఓ యువతితో ఇటీవల నిశ్చితార్థం అయ్యింది. పెద్దలు మే 12, శుక్రవారం అంటే రేపు వివాహముహూర్తం నిర్ణయించారు. పెళ్లి కూతురు ఇంటి వద్ద వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాటు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు యాకూబ్ తన ఇంటి వద్ద బోరు మోటర్ కు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గిల గిలా కొట్టుకుంటూ పడిపోయాడు. వెంటనే బంధువులు ఏరియా ఆస్పత్రికి తరలించేలోపు మార్గ మధ్యలోనే కన్నుమూశాడు. ఈ విషాదఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.