సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ‘బైడూ’. తను అభివృద్ధి చేసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. అపోలో ఆర్టీ6ను గురువారం ఆవిష్కరించింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై పపంచవ్యాప్తంగా ఇప్పటికే..పరిశోధనలు జరుగుతున్నా.. స్టీరింగ్‌తో పాటు డ్రైవర్ చేతులు కూడా స్టీరింగ్ పై ఉండాల్సిందే. కానీ.. బైడూ.. తీసుకొచ్చిన అపోలో ఆర్టీ6లో స్టీరింగ్ వీల్ అనేది లేదు. వచ్చే ఏడాది దీన్ని అందుబాటులోకి తేనున్నారు.
అపోలో ఆర్టీ6 ఒక్కో యూనిట్ ధర 37,000 డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 30 లక్షలు) వరకు ఉంటుందని బైడూ తెలిపింది. ధర తక్కువుగా ఉన్న నేపథ్యంలో.. ఈ కార్లు పెద్ద ఎత్తున మార్కెట్ లోకి వచ్చేందుకు అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. తమ వాహనంతో ప్రపంచవ్యాప్తంగా అటానమస్ వాహన వినియోగం పుంజుకుంటుందని బైడూ విశ్వాసం వ్యక్తం చేసింది. ఫలితంగా ప్రపంచాన్ని, డ్రైవర్ రహిత కార్లకు దగ్గర చేస్తుందని వ్యాఖ్యానించింది.
కార్ రూప్ టాప్ పై సెన్సార్లు, ఇంటరాక్టివ్ లైట్లు, ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్లు.. వంటి అన్ని ఎన్నో ఫీచర్లతో అపోలో ఆర్టీ6 సరికొత్తగా కనిపిస్తోంది. అత్యాధునిక సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టంతో దీన్ని అనుసంధానించారు. ఈ వ్యవస్థ కంప్యూటింగ్ పవర్ 1200 టాప్స్. కారు.. నిరంతరం అన్నివైపులా దృష్టి సారించేలా మొత్తం 38 సెన్సార్లను చుట్టూ అమర్చారు. ఇందులో 8 లైడార్లు, 12 కెమెరాలు ఉన్నాయి.
The Apollo RT6 is Baidu’s latest #Robotaxi . Equipped with 8 lidar and 12 camera, the vehicle can achieve L4 autonomous driving. #ElectricVehicles #AutonomousVehicles pic.twitter.com/PmVjKdqf8m
— Track&Wheels (@Trackwheels1) July 21, 2022
ఆర్టీ6.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అయినప్పటికీ.. 20 ఏళ్ల నైపుణ్యం గల డ్రైవర్ కున్న అనుభవం ఉంటుందని కంపెనీ తెలిపింది. స్టీరింగ్ లేని కారణంగా కారులో ఎక్కువ స్పేస్ అందుబాటులో ఉంటుందని.. ఫలితంగా తమకిష్టమైన ఇంటీరియర్ రూపొందించుకోవచ్చని పేర్కొంది. అదనపు సీట్లు, డెస్క్ టాప్స్, గేమింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసుకోవచ్చని వివరించింది. అపోలో ఆర్టీ6పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Fully autonomous. All-electric. Production-ready. This is the Apollo #RT6 – Baidu’s next-gen autonomous vehicle, unveiled at #BaiduWorld2022. With a unit cost of just $37k, the RT6 is bringing the world one step closer to a driverless future. Read more 👉 https://t.co/PLzVH7b9Ds pic.twitter.com/vPvq6WgVpC
— Baidu Inc. (@Baidu_Inc) July 21, 2022
ఇది కూడా చదవండి: Hyundai: టెస్లాను తలదన్నేలా హ్యుందాయ్ సరికొత్త ఎలక్ట్రిక్ కార్.. అయోనిక్ 6!
ఇది కూడా చదవండి: Kia EV6: సూపర్బ్ లుక్, అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటున్న కియా ఎలక్ట్రిక్ కార్..!