ప్రస్తుతం అందరూ స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడటానికి బాగా అలవాటు పడ్డారు. వాటిలోనూ మరీ ముఖ్యంగా స్మార్ట్ వాచెస్ కొనుగోలు చేసేవాళ్లు పెరిగిపోయారు. అలాంటి వారి కోసం బౌల్ట్ ఆడియో కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ ఒకటి ప్రస్తుతం మార్కెట్ లోకి విడుదలైంది.
ప్రస్తుతం స్మార్ట్ వాచెస్, స్మార్ట్ గ్యాడ్జెట్స్ కి సంబంధించి ఎక్కువ ఫీచర్లతో తక్కవ ప్రైస్ కి అందజేస్తేనే వారికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటోంది. అందుకే చాలా వరకు టెక్ కంపెనీలు తమ ఉత్పత్తులు తక్కువ ధరలో మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నాయి. అయితే యాపిల్ లాంటి సంస్థలకు చెందిన ఫోన్లు, స్మార్ట్ గ్యాడ్జెట్స్ ని మధ్యతరగతి వాళ్లు కొనడం అయితే దాదాపుగా కష్టమనే చెప్పాలి. కానీ, వాటిపై నుంచి మనసును పక్కకు మళ్లించలేరు. అందుకే చాలా టెక్ కంపెనీలు యాపిల్ తరహాలో ఫీచర్లను అందించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇప్పుడు బౌల్ట్ ఆడియో కంపెనీ ఆదే పనిని చేసింది. అది కూడా చాలా తక్కువ ధరలోనే.. యాపిల్ ఫీచర్ తో స్మార్ట్ వాచ్ ని రిలీజ్ చేసింది.
బౌల్ట్ ఆడియో కంపెనీకి చాలా మంచి పేరుంది. ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్, నెక్ బ్యాండ్స్ కు సంబంధించి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. స్మార్ట్ వాచెస్ కి సంబంధించి కూడా బౌల్ట్ కంపెనీకి మంచి పేరే ఉంది. ఇప్పుడు ఓ కొత్త మోడల్ ని బౌల్ట్ కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేసింది. అది అయితే ఏకంగా యాపిల్ స్మార్ట్ వాచ్ 8 సిరీస్ తో పోటీగా ఈ వాచ్ ని విడుదల చేసింది. యాపిల్ స్మార్ట్ వాచ్ 8 సిరీస్ లో మాదిరిగా 1000 నిట్స్ బ్రైట్ నెస్ తో స్మార్ట్ వాచ్ ని రూపొందించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా దాని ధర కూడా రూ.1,799గా నిర్ణయించడం ఇంకో ఆశ్చర్యకర విషయం.
బౌల్ట్ తాజాగా స్వింగ్ పేరిట బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ని విడుదల చేసింది. దీనిలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా 1000 నిట్స్ బై బ్రైట్ నెస్ డిస్ ప్లే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పేమెంట్స్ యాక్సెప్ట్ చేసేందుకు ఈ వాచ్ ని డిజైన్ చేశారు. అలాగే 1.9 ఇంచెస్ హెచ్ డీ స్క్రీన్, ప్రీమియం జింక్ అలోయ్ ఫ్రేమ్, హార్ట్ బీట్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, బీపీ మానిటరింగ్, పిరియడ్ సైకిల్, 7 డేస్ బ్యాటరీ లైఫ్, 20 రోజుల స్టాండ్ బై, 2 గంటల్లోనే ఫుల్ అయిపోయాలా ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూటూత్ కాలింగ్, ఐపీ67 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ.8,499కాగా 78 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,799కే అందిస్తున్నారు. అయితే ఇది పరిమితకాల ఆఫర్ అని చెబుతున్నారు.