స్మార్ట్ వాచ్ అంటే అందరికీ ఇష్టమే. అందులోనూ యాపిల్ వాచ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. కానీ, వాటిని కొనాలంటే ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, మార్కెట్ లోకి ఒక స్మార్ట్ వాచ్ రిలీజ్ అయ్యింది. దాని లుక్స్ చూస్తే అచ్చు యాపిల్ వాచ్ అల్ట్రాలాగానే ఉంటుంది.
ప్రస్తుతం అందరూ స్మార్ట్ గ్యాడ్జెట్స్ వాడటానికి బాగా అలవాటు పడ్డారు. వాటిలోనూ మరీ ముఖ్యంగా స్మార్ట్ వాచెస్ కొనుగోలు చేసేవాళ్లు పెరిగిపోయారు. అలాంటి వారి కోసం బౌల్ట్ ఆడియో కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ ఒకటి ప్రస్తుతం మార్కెట్ లోకి విడుదలైంది.
ఇవాళ్టి రోజుల్లో అందరూ ఫోన్లకు బానిసలయ్యారు. గాడ్జెట్స్ అంటే పడి చస్తున్నారు. సాధారణ జీవితానికి సుదూరంగా బతుకున్నారు అని నీతివాక్యాలు చెప్తుంటారు. కానీ, ఈ వార్త విన్నాక మీ అభిప్రాయాలు మారిపోతాయి. అవును గాడ్జెట్స్‌తో స్నేహమే మంచిదేమో అనే భావన మీకు కూడా కలుగుతుంది. ఓ ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడి ఉన్న యువకుడి ప్రాణాలు కాపాడింది ఓ స్మార్ట్ వాచ్. అటుగా వెళ్తున్న వారంతా చూస్తూ పట్టనట్లు వెళ్లిపోయారు. కనీసం అంబులెన్సుకు కూడా సమాచారం ఇవ్వలేదు. […]