ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. ఏ వస్తువైనా స్మార్ట్ గాడ్జెట్ అయి ఉండాలంటూ వినియోగదారులు కోరుకుంటున్నారు. అలా వచ్చిన వాటిలో స్మార్ట్ వాచ్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే చాలా మందికి ఈ స్మార్ట్ వాచ్‌లను కొనుగోలు చేయాలి అని ఉంటుంది. కానీ, ఏ స్మార్ట్ వాచ్ కొనాలి? ఎలాంటి ఫీచర్లు ఉన్న వాచ్ తీసుకోవాలి అనే విషయంపై కాస్త అవగాహన తక్కువగా ఉంటుంది. అయితే తక్కువ ధరలో.. అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ వాచ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బోట్ వేవ్ కాల్ స్మార్ట్ వాచ్:
బోట్ కంపెనీ గురించి వినియోగదారులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా తక్కువ సమయంలోనే బోట్ కంపెనీకి మంచి గుర్తింపు లభించింది. ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్, బ్లూటూత్ స్పీకర్ల విషయంలో బోట్ కంపెనీకి ఎంతో అభిమానులు ఉన్నారు. వాళ్లు తీసుకొచ్చిన స్మార్ట్ వాచ్‌లు కూడా చాలా మంచి గుర్తింపు పొందుతున్నాయి. అయితే ఇప్పుడు బోట్ కంపెనీ నుంచి ఒక స్మార్ట్ వాచ్ బడ్జెట్‌లోనే లభిస్తోంది. ఇ-కామర్స్ సైట్స్ లో దాదాపు 70 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. రూ.1,799కే బోట్ వేవ్‌కాల్ స్మార్ట్ లభిస్తోంది. దీనిలో బ్లూటూత్ కాలింగ్, ఆక్సిజన్ లెవల్స్, హార్ట్ రేట్ కౌంటింగ్ వంటి హెల్త్ ఫీచర్లు కూడా ఉన్నాయి. బోట్ వేవ్ కాల్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నాయిస్ పల్స్ గో బజ్:
నాయిస్ కంపెనీ నుంచి వస్తున్న స్మార్ట్ వాచ్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండే ఉంది. క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ కూడా ఈ కంపెనీ ప్రొడక్టులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడం కూడా ఈ క్రేజ్‌కి కారణం. ఈ కంపెనీ నుంచి వస్తున్న బడ్జెట్ స్మార్ట్ వాచెస్‌లో నాయిస్ పల్స్ గో బజ్ వాచ్ ఒకటి. ఈ వాచ్ ప్రస్తుతం ఇ-కామర్స్ సైట్స్ లో రూ.5 వేల విలువైన వాచ్ 60 శాతం డిస్కౌంట్‌తో రూ.1,999కే లభిస్తోంది. ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, 1.69 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్, వెదర్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ కేవలం 45 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఈ నాయిస్ పల్స్ గో బట్ స్మార్ట్ వాచ్‌ని కొనుగోలు చేయాలనుకుంటే క్లిక్ చేయండి.
ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ స్మార్ట్ వాచ్:
ఇప్పుడు స్మార్ట్ గ్యాడ్జెట్స్ విషయంలో ఫైర్ బోల్ట్ కంపెనీ పేరు కూడా బాగా వినిపిస్తోంది. ఈ వాచెస్ కంటే దీనికి బ్రాండ్ అంబాసిడర్లు ఉన్న వాళ్లను చూస్తే షాకవ్వాల్సిందే. మహేంద్ర సింగ్ ధోనీ, కియారా అద్వానీ, విక్కీ కౌశల్, విజయ్ దేవరకొండలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ నుంచి వస్తున్న వాచెస్‌లో బోల్ట్ ఫీనిక్స్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఇది రూ.10 వేలు ఎమ్మార్పీ ఉండగా.. ఇ-కామర్స్ సైట్‌లో రూ.1,999కే లభిస్తోంది. దీనిలో బ్లూటూత్ కాలింగ్, 1.3 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే, 24/7 హెల్స్ మానిటరింగ్ అందుబాటులో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ మోడల్ రౌండ్ అనలాగ్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ స్మార్ట్ వాచ్‌ని కొనుగోలు చేయాలంటే క్లిక్ చేయండి.
పీ ట్రాన్ ఫోర్స్ X10 స్మార్ట్ వాచ్:
పీ ట్రాన్ అనే కంపెనీ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ని చాలా తక్కువ ధరకే అందిస్తోంది. అయితే వాటి నాణ్యత మరీ గొప్పగా ఉండకపోయినా మీరు పెట్టే బడ్జెట్‌కు న్యాయం చేసేలానే ఉంటాయి. ఈ కంపెనీ నుంచి వచ్చిన పీ ట్రాన్ ఫోర్స్ X10 స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, రియల్ టైమ్ హార్ట్ రేట్ స్కానింగ్, ఆక్సిజన్ లెవల్స్, వాచ్ ఫేసెస్, ఐదురోజుల బ్యాటరీ లైఫ్, ఐపీ68 వాటర్ ప్రూఫ్ సామర్థ్యంతో ఈ వాచ్ లభిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.5,999 ఉండగా.. ఇ-కామర్స్ సైట్‌లో రూ.1,399కే లభిస్తోంది. ఈ పీ ట్రాన్స్ ఫోర్స్ X10 స్మార్ట్ వాచ్‌ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నాయిస్ ప్లస్ 2 మ్యాక్స్ అడ్వాన్స్‌డ్:
నాయిస్ కంపెనీ నుంచి లభిస్తున్న అద్భుతమైన స్మార్ట్ వాచెస్‌లో ఇంకో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ వాచ్ ఉంది. అదే నాయిస్ ప్లస్ 2 మ్యాక్ అడ్వాన్స్‌డ్. ఈ వాచ్ 1.85 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. దీనిలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. దీని బ్యాటరీ లైఫ్ 10 డేస్ వరకు ఉంటుందని చెబుతున్నారు. దీనిలో 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్‌లో డునాట్ డిస్టర్బ్ ఆప్షన్ కూడా ఉంది. నాయిస్ హెల్త్ సూట్, హార్ట్ రేట్ మోనిటరింగ్, లేడీస్ కోసం పిరియడ్ సైకిల్ కౌంట్ వంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.5,999గా ఉండగా ఇ-కామర్స్ సైట్‌లో రూ.2,499కే లభిస్తోంది. ఈ నాయిస్ ప్లస్ 2 అడ్వాన్స్‌డ్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.