పబ్జి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆటకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ గేమ్ కి అడిక్టెర్స్. ఇండియన్ గేమింగ్ మార్కెట్ లో సింహ భాగం ఈ గేమ్ దే. కానీ.., ప్రత్యేక పరిస్థితిల నడుమ ఇండియన్ గవర్నమెంట్ పబ్జి పై నిషేధం విధించింది. అప్పటి నుండి యూజర్స్.. కొత్త వెర్షన్ కోసం ఎదురుచూస్తూ వచ్చారు. వీరి కోసం క్రాఫ్టన్ అనే గేమింగ్ కంపెనీ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో పబ్‌జీ కొత్త వెర్షన్ ని ప్రత్యేకంగా ఇండియన్ యూజర్స్ కోసం సిద్ధం చేసింది. ఇక జూన్ 18న విడుదల విడుదలైన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా ఎర్లీ యాక్సిస్ వెర్షన్ దశల వారీగా అందరికీ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటి వరకు 5 లక్షలకి పైగానే డౌన్ లోడ్స్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో.., పబ్జి స్థానాన్ని బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సక్సెస్ ఫుల్ గా భర్తీ చేయగలిగిందని అంతా సంబర పడుతున్న వేళ ఓ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది.
పబ్జి లో ఇండియన్ యూజర్స్ డేటా అంతా చైనా సర్వర్స్ కి ట్రాన్స్ఫర్ అవుతోందన్న కారణంగానే ఆ గేమ్ పై నిషేధం విధించారు. కానీ.., బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాలో డేటా షేరింగ్ కి చైనాతో ఎలాంటి సంబంధం ఉండదని.., డేటా షేరింగ్, సర్వర్స్ ప్రోసెసింగ్ అంతా దేశీయంగా జరుగుతుందని క్రాఫ్టన్ కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఈ కారణంగానే కేంద్రం బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాకి పర్మిషన్స్ ఇచ్చింది. కానీ.., ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్స్ డేటా చైనా సర్వెర్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుందన్న చర్చ జరుగుతోంది.ఈ డేటని చైనా, హాంగ్ కాంగ్, యుఎస్ మాస్కో కి పంపించి స్టోర్ చేస్తున్నారని ఐజియం ఇండియా ఓ నివేదిక సిద్ధం చేసింది.
బీజింగ్‌లోని చైనా మొబైల్ కమ్యూనికేషన్ సర్వర్లుకు, హాంకాంగ్‌లోని టెన్సెంట్ నడుపుతున్న ప్రాక్సిమా బీటా సర్వర్లుకు,.. ముంబై, మాస్కో యుఎస్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వర్‌లకు డేటా పంపబడిందిని ఐజియం ఇండియా కచ్చితంగా చెప్పగలుగుతుంది. ఇదే నిజమైతే గేమ్ ని బూట్ చేస్తున్నప్పుడు బీజింగ్‌లోని టెన్సెంట్ సర్వర్‌కు డేటా సులభంగా వెళ్ళిపోతుంది. దీంతో.., బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ ని నిషేదించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు CAIT లేఖ వ్రాసింది. మరి.., రానున్న కాలంలో కేంద్ర ప్రభుతం బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.