మహిళల ప్రీమియర్ లీగ్‌లో పరుగుల వరద పారుతోంది. ఆడుతున్న తీరు.. పారుతోన్న బౌండరీలు చూస్తుంటే.. ఆడుతోంది అమ్మాయిలేనా అనిపిస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచులో ముంబై ఇండియన్స్ 207 పరుగులు చేసి ఔరా అనిపించగా.. రెండో మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఏకంగా 223 పరుగులు చేసి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్‌లో పరుగుల వరద పారుతోంది. ఆడుతున్న తీరు.. పారుతోన్న బౌండరీలు చూస్తుంటే.. ఆడుతోంది అమ్మాయిలేనా అనిపిస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచులో ముంబై ఇండియన్స్ 207 పరుగులు చేసి ఔరా అనిపించగా.. రెండో మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఏకంగా 223 పరుగులు చేసింది. ముంబై బ్రబౌర్నే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. ఢిల్లీ ఇన్నింగ్స్ లో సిక్సులు, ఫోర్లు ద్వారానే 162 పరుగులు వచ్చాయంటే మ్యాచ్ ఏ రకంగా సాగిందో అర్థం చేసుకోవాలి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు ఓపెనర్లు షఫాలీ వర్మ, మెగ్ లానింగ్ శుభారంభం ఇచ్చారు. తొలి బంతి నుంచే ఈ జోడి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బౌలర్లపై విరుచుకు పడ్డారు. పోటాపోటీగా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఏకంగా తొలి వికెట్‌కు 163 పరుగులు జోడించారు. 45 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 84 పరుగులు చేయగా, మెగ్ లానింగ్ 43 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఆర్‌సీబి నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 163 పరుగులకే పరిమితమయ్యింది.
Target for RCB: 224 runs. #RCBvsDC #WPL #WomensPremierLeague pic.twitter.com/53EmTl59CH
— RVCJ Sports (@RVCJ_Sports) March 5, 2023
ఇన్నింగ్స్ ధాటిగానే ఆరంభించిన ఆర్‌సీబి వరుస వికెట్లు కోల్పోతూ మ్యాచుపై పట్టు కోల్పోయింది. కెప్టెన్ స్మృతి మంధాన (35; 23 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులతో రాణించగా, హీథర్ నైట్ (34), ఎలిసే పెర్రీ (31), మేఘనా షట్ (30) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్ తారా నోరిస్ ఐదు వికెట్లు తీసి ఆర్‌సీబిని కోలుకోలేని దెబ్బకొట్టింది. కీలకమైన హీథర్ నైట్ (34), ఎలిసే పెర్రీ (31), దిశా కసత్(9), కనికా అహుజా (0), రీచా ఘోష్ (2)లను ఔట్ చేసిన నోరిస్, డబ్ల్యూపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి అసోసియేట్ ప్లేయర్ నోరిస్ రికార్డు సృష్టించింది. మహిళల ప్రీమియర్ లీగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Just @JemiRodrigues Things!! 😀#WPL #WPL2023 #CricketTwitter pic.twitter.com/W7tGOYyhIx
— WomenCricket.com (@WomenCricketHQ) March 5, 2023
Meg Lanning is happy to be on Shafali Verma’s side for once 😄https://t.co/1wbkrqvP1S | #WPL2023 pic.twitter.com/Cae895GRiC
— ESPNcricinfo (@ESPNcricinfo) March 5, 2023