మహిళల ప్రీమియర్ లీగ్‌లో పరుగుల వరద పారుతోంది. ఆడుతున్న తీరు.. పారుతోన్న బౌండరీలు చూస్తుంటే.. ఆడుతోంది అమ్మాయిలేనా అనిపిస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచులో ముంబై ఇండియన్స్ 207 పరుగులు చేసి ఔరా అనిపించగా.. రెండో మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఏకంగా 223 పరుగులు చేసి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.
ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘనతను ఇండియన్ ఉమెన్స్ టీమ్ సాధించింది. నిజానికి వన్డే క్రికెట్‌లో ఇదో చరిత్రగా నిలిచిపోవడం ఖాయం. 174 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించి రికార్డు సృష్టించారు. మహిళల క్రికెట్‌లో ఇంతవరకు ఈ ఘనత ఎవరూ సాధించలేదు. శ్రీలంక నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు షఫాలీ వర్మ(71 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 71 నాటౌట్), స్మృతి మందాన(83 బంతుల్లో 11 ఫోర్లు, […]