అంబటి రాయుడు.. కావాల్సినంత టాలెంట్ ఉన్నా, కొంచెం కూడా అదృష్టం లేక కెరీర్ లో వెనుకపడిపోయిన గొప్ప క్రికెటర్. సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, గంగూలీ లాంటి దిగ్గజ క్రికెటర్స్ సైతం రాయుడి టాలెంట్ ని కొనియాడినవారే. కానీ.., జట్టులో మాత్రం రాయుడి స్థానం ఎప్పుడూ ప్రశ్నార్ధకమే. ఇప్పుడు టీమ్ లో ఉన్న సో కాల్డ్ హిట్టర్స్ కన్నా.., రాయుడి టి-ట్వంటీ స్ట్రైక్ రేట్ ఎక్కువ. పైగా.., అవసరం అనుకుంటే సాలిడ్ డిఫెన్స్ చేయగల సామర్ధ్యం అతని సొంతం. ఫేస్ బౌలింగ్ లోనైనా, స్పిన్ బౌలింగ్ లోనైనా ఎలాంటి తడబాటు లేకుండా పరుగులు చేయగలడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నా మన సెలెక్టర్స్ కి అంబటి రాయుడు అంటే చిన్న చూపు.
తాజాగా.. సెలెక్టర్స్ శ్రీలంక పర్యటన కోసం ఇండియన్ స్క్వాడ్ ని సెలెక్ట్ చేశారు. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, ఐదు టెస్ట్ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉంది. దీంతో.., లంక పర్యటనకి మరో జట్టుని ఎంపిక చేసింది బీసీసీఐ. కానీ.., ఈ జట్టులో కూడా రాయుడికి స్థానం దక్కకపోవడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జులై 13న ఈ పర్యటన ఆరంభం కానుంది. దేవదత్ పడిక్కల్, నితీష్ రాణా, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్, రుతురాజ్ గైక్వాడ్కు తొలిసారి భారత జాతీయ జట్టులో అవకాశం దక్కింది. ఇదే సమయంలో పృథ్వీ షా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ భారత జట్టులోకి పునరాగమనం చేశారు. మనీష్ పాండే, సంజు శాంసన్ కూడా జట్టులోకి వచ్చారు. వీరంతా యువ క్రికెటర్స్. కానీ.., మిడిల్ ఆర్డర్ లో రాయుడు లాంటి అనుభవం ఉన్న ఆటగాడు ఉంటే బాగుండేది కదా అన్నది అభిమానుల ప్రశ్న.
శ్రీలంకలో అన్నీ స్పిన్ కి అనుకూలించే పిచ్ లు. అక్కడ రాణించాలంటే దూకుడు, సహనం కలగలసిన ఆట కావాలి. ఇలా లంక పర్యటనకి కావాల్సిన అన్నీ అర్హతలు ఉన్నా.., అంబటి రాయుడికి ఎప్పటిలానే మొండి చేయి చూపించడం క్రికెట్ లవర్స్ ని బాధిస్తోంది. గతంలో వరల్డ్ కప్ లో స్థానం దక్కలేదని 3డీ ట్వీట్స్ చేసిన రాయుడు.., ఆ కోపంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కి రెటైర్డ్మెంట్ ప్రకటించాడు. కానీ.., తరువాత కాలంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అట మీద ఫోకస్ పెట్టాడు. ఇక లాస్ట్ ఐపీఎల్ లో కూడా రాయుడు చక్కగా రాణించాడు. అయినా.., రాయుడి కష్టానికి ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ సీరిస్ కి శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, రాహుల్ ద్రావిడ్ కోచ్ గా రంగంలోకి దిగనున్నాడు. మరి.., ఈ టీమ్ లో కూడా రాయుడికి స్థానం దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.