టీమిండియా స్పీడ్ గన్ ఉమేశ్ యాదవ్‌ను అతని స్నేహితుడు నిండా ముంచేశాడు. స్నేహితుడే కదా అని పిలిచి ఉద్యోగం ఇస్తే.. అతడు మాత్రం ఆస్తి కొనుగోలు పేరుతో ఇతగాడికి టోపీ పెట్టాడు. భూమి ఇప్పిస్తానని రూ. 44 లక్షలు కాజేసి.. అనంతరం మెల్లగా జారుకున్నాడు. దీంతో ఉమేశ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న కొరాడి పోలీసులు నిందితుడి పట్టుకునే పనిలో పడ్డారు. జరిగిందిదే.. నాగ్‌పుర్ కు చెందిన శైలేశ్ థాక్రే అను వ్యక్తి, ఉమేశ్ […]
క్రికెటర్ గా రాణించాలని, దేశానికి ఆడాలని కలలు కనే యువ ఆటగాళ్లు దేశంలో ఎందరో ఉన్నారు. అందుకోసం వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయినప్పటికీ అతి కొద్ది మందికే ఆ అదృష్టం దక్కుతుంది. అలాంటి అదృష్టవంతులలో భారత యువ క్రికెటర్ విజయ్ జోల్ ఒక్కరు. ఇతగాడు భారత అండర్ 19 జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. ఇప్పుడు అసలు విషయమేమిటంటే.. ఇతడిని కిడ్నాపింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు అతని సోదరుడు విక్రమ్ […]
ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న మ్యాచులో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. 145 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 200 మార్కు చేరుకున్నాడు. 87 బంతుల్లోనే సెంచరీ మార్కు చేరుకున్న గిల్, 200 మార్క్ చేరుకోవడానికి మరో 58 బంతులు మాత్రమే తీసుకోవడం గమనార్హం. మరో ఎండ్ లో బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నా తాను మాత్రం ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. దీంతో భారత్ నిర్ణీత […]
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడల్లో క్రికెట్ ముందువరుసలో ఉంది. ఇక ఇండియాలో క్రికెట్ ను ఓ మతంలా చూస్తారని ప్రేత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి ఆటగాళ్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు, వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు క్రికెట్ లో లేవనెత్తని ప్రశ్నను లేవనెత్తాడు కన్నడ నటుడు చేతన్ కుమార్ అహింస. ఇండియన్ క్రికెట్ లో రిజర్వేషన్లు తీసుకురావాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన వారందరు అగ్రకులాలకు […]
‘స్మృతి మందాన..’ ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా.. ఇంతా కాదు. ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. తన పేరిట వెలిసిన అభిమాన సంఘాలు, ఫ్యాన్ క్లబ్‌లకైతే లెక్కేలేదు. క్రికెట్ అంటే తెలియనివాళ్లు కూడా ఈ పాప కోసం వుమెన్స్ క్రికెట్ చూడడం మొదలెట్టారంటే… స్మృతి మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోయే ఈ భామ.. తన అందమైన నవ్వు, అంతకంటే అందమైన చిలిపి నవ్వుతో ఎంతోమంది కుర్రాళ్ల మనసులు మనసులు కొల్లగొట్టింది. […]
భారత మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ వివాదంలో చిక్కుకుంది. తన సన్నిహితులతో సూపర్ మార్కెట్ పై దాడికి పాల్పడ్డ ఆమె.. దుకాణదారుడిపై చేయి చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజేశ్వరి గైక్వాడ్ కర్ణాటకలోని విజయపురలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆమె, కాస్మొటిక్స్ కొనడం కోసం.. కాలనీలోని ఓ సూపర్ మార్కెట్ కు వెళ్ళింది. అక్కడకి వెళ్ళాక ఆమె సిబ్బందితో ఏదో విషయమై గొడవపడినట్లు సమాచారం. సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఆమె.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్దిసేపటి […]
ఆసియాకప్ లో టీమిండియా ప్రదర్శన అందరికీ పెద్ద షాక్. లేకపోతే ఏంటి.. ఫైనల్ కి వెళ్లడం, టైటిల్ గెలవడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. కానీ రియాలిటీ జరిగిందే వేరే. లీగ్ దశలో బాగానే ఆడిన మన జట్టు.. సూఫర్ 4 దశకు వచ్చేసరికి తేలిపోయింది. గాలి బుడగలా పేలిపోయింది. పాకిస్థాన్ తో మ్యాచులో 5 వికెట్ల తేడాతో, శ్రీలంకతో మ్యాచులో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే […]
సుమారు ఆరేళ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లింది టీమిండియా. అక్కడ కేఎల్ రాహుల్ సారధ్యంలోని టీమిండియా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే ప్రస్తుతం ఆ దేశం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నది. ఈ విషయంపై టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.బాత్‌రూముల్లో గంటలకు గంటలు ఉంటూ నీటిని వృథా చేయవద్దంటూ కీలక సూచన చేసింది. ఐదు నిమిషాల్లో స్నానం ముగించుకుని రావాలని, నీటిని కాపాడాలని సూచించింది. జింబాబ్వేలో ప్రస్తుతం నీటి కొరత […]
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావాలంటే ఒకటే మార్గం ఉందని ఆయన వెల్లడించారు. ఇటీవల పార్థివ్ పటేల్ టీమిండియా జట్టులో టాప్ ఆర్డర్‌లో యువ ఆటగాళ్ళకు అవకాశాలు ఇస్తూ ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓపెనర్లకే ఈ అవకాశాలు ఇస్తోంది. కేఎల్ రాహుల్ గాయపడడం, విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో టాప్ ఆర్డర్‌లో యువ బ్యాట్స్‌మెన్‌లు తమ సత్తా నిరూపించుకునేందుకు […]
భారత మాజీ వైస్ కెప్టెన్ మరియు భారత అంతర్జాతీయ క్రికెటర్ ‘అజింక్య రహానే’ రెండోసారి తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని రహానే భార్య రాధికా దోపవాకర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. కడుపుతో ఉన్న రాధికా.. ఆమె భర్త రహానే, కూతురు ఆర్యతో కలిసి ఉన్న ఫోటోను రాధికా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో రాధికా కడుపుతో ఉండడం గమనించిన అభిమానులు కామెంట్లతో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఈ ఏడాది అక్టోబర్ నెలలో […]