టీమిండియా కొత్త సారధి రోహిత్ శర్మపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసలు కురిపించాడు. అక్కడితో ఆగకుండా మరొక అడుగు ముందుకేసి టెస్టుల్లో కోహ్లీ కన్నా రోహిత్ విజయవంతమైన కెప్టెన్ అవుతాడంటూ అకాశానికెత్తాడు. కోహ్లీకి సరైన వారసుడు రోహితేనని జాఫర్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన హిట్ మ్యాన్.. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా అద్భుత విజయాలు అందుకుంటున్నాడు. రోహిత్ నేతృత్వంలోని భారత జట్టు స్వదేశంలో వరుసగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్, వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్, శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్‌లను వైట్‌వాష్ చేసింది.
‘‘కోహ్లీ కన్నా రోహిత్ బెటర్ టెస్టు కెప్టెన్ అవుతాడు. అయితే ఎన్ని టెస్టులకు కెప్టెన్‌గా ఉంటాడనేది ప్రశ్న. నా వరకు వ్యూహాల ప్రకారం అతను అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడు. వరుస వైట్‌వాష్‌లతో అతని వ్యూహాల ఫలితాలు కనిపిస్తూనే ఉన్నాయి. సరైన వ్యక్తి చేతుల్లోకి కెప్టెన్సీ వచ్చినట్లు అనిపిస్తోంది’’ అని జాఫర్ చెప్పుకొచ్చాడు. అలాగే సౌతాఫ్రికా చేతిలో ఓటమి వల్ల వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరడంపై అనుమానాలు ఉన్నప్పటికీ.. ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయని జాఫర్ పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: IPL 2022 టికెట్స్ ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలంటే?‘‘ఇంగ్లాండ్ లో ఒక టెస్టు, ఆ తర్వాత మళ్లీ బంగ్లాదేశ్‌లో ఆడాలి. అంటే చాలా బ్రేక్స్ దొరుకుతాయి. అయితే ఆస్ట్రేలియా ఇక్కడకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆడితే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరడం సమస్య కాదని నా అభిప్రాయం’’ అని వివరించాడు. కాగా, గతేడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు భారత శిబిరంలో కరోనా కారణంగా ఐదో టెస్టు ఆడకుండానే టీమిండియా వెనక్కు వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆ టెస్టును భారత్ ఆడనుంది. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా 68 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కోహ్లీ 40 విజయాలతో టీమిండియా అత్యుత్తమ విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందాడు.
Since @ImRo45 became full time Captain:
3-0 vs NZ (T20I)
3-0 vs WI (ODI)
3-0 vs WI (T20I)
3-0 vs SL (T20I)
2-0 vs SL (Tests) #INDvSL pic.twitter.com/ojREzqlA6M— Wasim Jaffer (@WasimJaffer14) March 14, 2022
CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W
— BCCI (@BCCI) March 14, 2022