టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడంపై సోషల్ వార్ నడుస్తుంది. కోహ్లీ ఫ్యాన్స్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై గుర్రుగా ఉన్నారు. దాదాకు కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. దీంతో దాదా వర్సెస్ కోహ్లీ వార్ కాస్తా.. కోహ్లీ వర్సెస్ దాదా+రోహిత్ శర్మగా మారిపోయింది. దానికి తోడు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్తూ వెళ్తూ.. రాజేసిన అగ్గి ఇప్పట్లో చల్లారేలా కనిపించటం లేదు.
వన్డే కెప్టెన్సీ వేటు విషయంలో కోహ్లీ చేసిన కామెంట్స్‌పై స్పందించేందుకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ సౌరవ్ గంగూలీ పూర్తిగా నిరాకరించాడు. వ్యవహారాన్ని బోర్డు సరైన రీతిలో పరిష్కరించుకుంటుందని చెప్పాడు. సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కేముందు బుధవారం మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. బోర్డుపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని తనను ఎవరు అడగలేదని, వన్డే కెప్టెన్సీ వేటు గురించి టెస్ట్ టీమ్ సెలెక్షన్ అప్పుడే చెప్పారని ప్రకటించాడు. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని విరాట్‌ను రిక్వెస్ట్ చేశామంటూ అంతకుముందు బీసీసీఐ చైర్మన్ దాదా చేసిన వ్యాఖ్యలకు ఇవి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: కెప్టెన్ అయిన ఆనందంలో.. భార్యకి భారీ గిఫ్ట్ ఇచ్చిన రోహిత్ శర్మ!
విరాట్ కామెంట్స్‌తో సౌరవ్ గంగూలీతో పాటు బీసీసీఐ పెద్దలంతా ఇరకాటంలో పడ్డారు. దాంతో బీసీసీఐ పెద్దలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా బోర్డు, విరాట్ మధ్య అసలేం జరుగుతోందనే చర్చ కూడా మొదలైంది. ఇక కోహ్లీ ఫ్యాన్స్ అయితే గంగూలీ, జై షాలను విలన్‌గా చూపుతూ సోషల్ మీడియాలో విమర్శలకు తెరలేపారు. గంగూలీపై ఉన్న గౌరవం పోయిందని, జై షా చేతిలో దాదా కీలు బొమ్మ అవుతాడని అస్సలు ఊహించలేదని ఘాటు కామెంట్లు చేశారు. అయితే సౌరవ్ గంగూలీకి అండగా నిలుస్తూ కొందరు అభిమానులు ట్విటర్ వేదికగా #NationStandsWithDada అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ క్యాంపైన్ ఉదయం మొదలవ్వగా.. సాయంత్రానికల్లా ఈ ట్వీట్ ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు ఈ క్యాంపైన్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఎన్‌సీఏలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ
ఏది ఏం జరిగినా.. తామెప్పటికీ దాదా అభిమానులమేనని, ఈ దేశం మొత్తం అతనికి అండగా నిలుస్తుందని ట్వీట్ చేశారు. భారత క్రికెట్‌లోని సరికొత్త విప్లవం తీసుకొచ్చిన దాదా.. కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడని, మేటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకొచ్చాడని గుర్తు చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సమూల మార్పులు తీసుకొస్తున్నాడని, త్వరలోనే వాటికి ఫలితాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. దాదాకు అండగా జరుపుతున్న క్యాంపైన్‌కు బదులుగా కోహ్లీ ఫ్యాన్స్ కూడా మరో క్యాంపైన్‌కు తెరలేపారు. దేశం మొత్తం గంగూలీకి అండగా ఉందని రోహిత్ ఫ్యాన్స్ అంటుంటే.. ఈ ప్రపంచమే కోహ్లీ వెనుకాల ఉందని బదులిస్తున్నారు. ఈ క్రమంలోనే #WorldStandsWithKohli అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: కెప్టెన్‌గా కోహ్లీని తప్పించడం కరెక్టేనా? రికార్డులు చూస్కోండి.. దాదా, ధోని కంటే బెటర్
సౌరవ్ గంగూలీ కన్న కలలను కోహ్లీ చేసి చూపించాడని అంటున్నారు. గంగూలీ ఈ దేశానికే స్టార్ అని, కానీ కోహ్లీ ఈ ప్రపంచం మొత్తానికి హీరోనని ట్వీట్ చేస్తున్నారు. గంగూలీ, జైషాలను కోహ్లీ తన బ్యాట్‌తోనే షూట్ చేయాలని కోరుతున్నారు. రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కోహ్లీ ఎంత చెప్పినా.. అభిమానుల మాత్రం రెండుగా చీలిపోయి.. ట్విట్టర్ వేదికగా రచ్చచేస్తున్నారు. మరి ఈ ఫ్యాన్ వార్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Never mess with @imVkohli 😈#WorldStandsWithKohli pic.twitter.com/3N5YjfpGZf
— Ajit (@Ailwas_18) December 17, 2021
The Man Who Changed the Face and Shape of Indian Cricket
The Leader who formed team like Sehwag, Yuvraj, Dhoni, Zaheer and Harbhajan
As Bcci President: Made Dravid as Coach, Laxman as NCA Chief and Rohit as Captain for Limited Overs#NationStandsWithDada @SGanguly99 @BCCI pic.twitter.com/Ml1mdVQgpE
— Maniraj Ganguly (@MGanguly99) December 16, 2021
Lord ganguly can only dream of this #WorldStandsWithKohli pic.twitter.com/SUDNIcWI5x
— Akash Raj (@iamnotvkohli) December 17, 2021
They are messing up with wrong fanbase 🔥🤫
Virat fc mass 🔥#WorldStandsWithKohli pic.twitter.com/NsVCgXw2Sg— Anjali Sharma (@Anjali_vk_18) December 17, 2021