ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే మహాభారత యుద్ధమే జరుగుతున్నట్టు ఉంటుంది. పాక్ ఇండియా పట్ల చూపించే చులకనభావం వల్లే ఈ యుద్ధ వాతావరణం ఏర్పడింది. పాక్ ఎప్పుడూ ఇండియాని తమ మాటలతో యుద్ధానికి సై అని కవ్విస్తుంటుంది. ఈ విషయంలో భారత క్రికెటర్లు ఏమీ తక్కువ కాదు. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే తప్పక గెలవాలన్న నియమం పెట్టుకుంటారు. మహాభారతంలో కౌరవులపై పాండవులు చేసిన యుద్ధంలా మన వాళ్ళు పాకిస్తాన్‌పై విజృంభిస్తారు. ఈ ప్రాసెస్‌లో కొన్ని సార్లు ఓడిపోవచ్చు గాక. అంతమాత్రాన తక్కువ చేస్తే ఎలా? 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరల్డ్ కప్ టోర్నీలో పాక్ చేతిలో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్‌లో షాహీన్ షా అఫ్రిది తన బౌలింగ్‌తో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లను తీశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేయలేక ఓటమి పాలైంది. దీంతో పాక్ గాళ్లకి విజయ గర్వం పెరిగిపోయింది. ఆసియా కప్ 2022 టోర్నమెంట్లో భాగంగా ఆగస్ట్ 28న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాకిస్తాన్ క్రికెట్ కోచ్ వకార్ యూనిస్ భారత క్రికెటర్లను అవమానించే విధంగా ట్వీట్ చేశాడు. ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదికి గాయం అవ్వడం వల్ల ఆసియా కప్ టోర్నీకి దూరమయ్యాడు. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వకార్ యూనిస్ చేసిన ట్వీట్ కారణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
“షాహీన్ అఫ్రిది గాయం అవ్వడం వల్ల భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కి పెద్ద ఉపశమనం. ఆసియా కప్ 2022లో షాహీద్‌ని చూడలేకపోవడం విచారకరం. త్వరలోనే గాయం నుంచు కోలుకుని ఫిట్నెస్ సాధించాలి ఛాంపియన్” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో భారత క్రికెట్ అభిమానులు వకార్ యూనిస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఏ మీ పాక్ జట్టులో ఆ ఒక్కడు తప్ప ఇంక మగాళ్ళే లేరా, షాహీన్ అఫ్రిదికి తప్ప ఇంక ఎవరికీ మగతనం లేదా” అని కొందరు, “ముందు ఆసియా కప్ గెలిచి చూపించండి, షాహీన్ అఫ్రిదికి అంత సీన్ లేదు, ముందుంది ముసళ్ల పండుగ” అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
దీంతో వకార్ యూనిస్ భారత క్రికెటర్లను అవమానించబోయి తమ పాక్ క్రికెటర్లనే అవమానించుకున్నట్టు అయ్యిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పాకిస్తాన్ ఇలా భారత్‌ని చులకన చేయడం అన్నది సరైన పద్ధతి కాదని, వారి ఆటగాళ్ళని మెచ్చుకోవడంలో తప్పు లేదు కానీ ఇలా వాళ్ల ఆటగాడిని లేపడం కోసం భారత క్రికెటర్లని అవమానించడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి వకార్ యూనిస్ భారత క్రికెటర్లని అవమానించేలా చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
Shaheen’s injury Big relief for the Indian top order batsmen. Sad we won’t be seeing him in #AsiaCup2022 Get fit soon Champ @iShaheenAfridi pic.twitter.com/Fosph7yVHs
— Waqar Younis (@waqyounis99) August 20, 2022