టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మకు ఎన్‌సీఏ డైరెక్టర్, టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. గాయం కారణంగా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. అనంతరం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ రిహ్యాబ్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకు శిక్షణ తీసుకుంటున్నాడు. అలాగే అక్కడ శిక్షణ పొందుతున్న అండర్-19 క్రికెటర్లకు రోహిత్ శర్మ సలహాలు, సూచనలు అందిస్తున్నాడు.
ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్.. తన విలువైన సమయాన్ని, సలహాలను అకాడమీలోని యువ ఆటగాళ్లతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో థ్యాంక్స్ చెప్తు పోస్టు చేశాడు. రోహిత్ శర్మ యువ క్రికెటర్లతో తన అనుభవాలను పంచుకుంటూ.. సలహాలు, సూచనలు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ముదురుతున్న గంగూలీ – కోహ్లీ వార్! అసలు తప్పు ఎవరిది?
A big thanks to Rohit Sharma for taking time from his rehab to talk to the Asia Cup-bound Under-19 squad at the NCA. I am sure the boys would have gained immensely from Rohit sharing his wisdom and experiences. pic.twitter.com/QGJXN8VCXq
— VVS Laxman (@VVSLaxman281) December 17, 2021