భారత క్రికెట్ లో వీవీఎస్ లక్ష్మణ్ ది ఒక ప్రత్యేక స్థానం. ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో లక్ష్మణ్ తనదైన ముద్ర వేసాడు. 10000 పరుగులు, 30 సెంచరీలు చేయకపోయినా లక్ష్మణ్ దిగ్గజాల సరసన నిలుస్తాడు. అలాంటి ఒక లెజండరీ వీవీఎస్ లక్ష్మణ్ కొడుకు క్రికెట్ లో తన ప్రయాణాన్ని గ్రాండ్ గా ప్రారంభించాడు.
2022, టీమిండియాకు చాలా భారంగా గడిచింది. కెప్టెన్ల మార్పుతో పాటు చాలా పొరపాట్లు జరిగాయి. ఇప్పుడు వాటిని గానీ సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ఛాన్సుంది. అందులో భాగంగానే ఇప్పటికే కెప్టెన్సీ విషయంలో పలు మార్పులు జరుగుతున్నాయి. నేటి(జనవరి 3) నుంచి శ్రీలంకతో జరగబోయే టీ20లకు హార్దిక్ పాండ్య, వన్డేలకు రోహిత్ కెప్టెన్సీ వహిస్తారు. ఇక త్వరలో కెప్టెన్సీ బాధ్యతలు పూర్తిగా హార్దిక్ కే అప్పగించనున్నారని తెలుస్తోంది. ఈ విషయం ఇంకా తేలకముందు కోచ్ […]
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో పంత్ కారు ప్రమాదానికి గురైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ యాక్సిండెంట్ లో పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా మంటల్లో దగ్దం అయ్యింది. యాక్సిడెంట్ జరగ్గానే పంత్ కారు అద్దాలను పగలగొట్టుకుని బయటకి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి గురైన వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. […]
మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్స్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వీవీఎస్ లక్ష్మణ్ అనే ఓ తెలుగు కుర్రాడిని బ్యాటింగ్ ఆర్డర్ లో కాస్త ముందుకి పంపించాడు. చివరిలో టీమ్ కి వెన్నముకగా నిలవాల్సిందిగా ద్రవిడ్ కి బాధ్యతలు అప్పగించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్స్ నిప్పులు కురిపించారు. కానీ.. ఈసారి టీమిండియా బ్యాటింగ్ అప్రోచ్ మారింది.
కాలానికి తగ్గట్టుగా మనిషి.. మనిషి ఆలోచనలు మారాలి. అలా మారకపోతే ప్రపంచంలో ముందుకు వెళ్ళలేం. ప్రస్తుతం టీమిండియా ఇదే పరిస్థితిలో ఉంది. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై దారుణంగా ఓడిపోయింది. దాంతో ఒక్క ఆటగాళ్లపైనే కాకుండా కోచ్, యాజమాన్యం పై కూడా సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దానికీ ఓ కారణం ఉంది. క్రీడా ప్రపంచంలో మిస్టర్ వాల్ గా పేరుగాంచిన రాహుల్ ద్రవిడ్ టీ20లకు కోచ్ గా ఎందుకు? జట్టు […]
మనికట్టు మాత్రికుడిగా వీవీఎస్ లక్ష్మణ్‌కు టెస్టు క్రికెట్‌లో ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ క్రికెట్‌ను ఆస్ట్రేలియా శాసిస్తున్న సమయంలోనే.. ఆ జట్టును ఒంటిచేత్తో ఓడించిన ఘనుడు లక్ష్మణే. దుర్భేద్యమైన ఆసీస్ బౌలింగ్ ఎటాక్‌ను తన మనికట్టు మాయాజాలంతో ఒక ఆట ఆడుకున్నాడు. 2001లో వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన 281 పరుగుల ఇన్నింగ్స్ ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో ఒక సంచలనం. అసలు టెస్టు క్రికెట్‌లో ఫాలో అన్ ఆడి గెలిచిన జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే.. అలాంటి […]
రాహుల్ ద్రవిడ్.. నైపుణ్యం గల యువ ఆటగాళ్లను వెలికి తీయడంలో దిట్ట. అదీ కాక వాళ్లకు శిక్షణ ఇచ్చి వారిని ఓ వరల్డ్ క్లాస్ క్రీడాకారులుగా ఎలా తయారు చేయాలో అతనికి తెలిసినంతగా మరెవరికీ తెలిదనడంలో అతిశయోక్తి లేదు. ఇక ద్రవిడ్ భారత కోచ్ పగ్గాలు చేపట్టాక టీంమిండియా విజయ పరంపరలు కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ద్రవిడ్ కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ కు బీసీసీఐ […]
ప్రస్తుతం ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లతో టీమిండియా ఆటగాళ్లంతా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. రోహిత్ శర్మ సారధ్యంలోని సీనియర్ల జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తుండగా.. హార్దిక్ పాండ్యా సారధ్యంలోని మరో జట్టు ఐర్లాండ్ తో రెండు టీ20ల సిరీస్ లో పాల్గొననుంది. అయితే టీమిండియా ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలేలా ఉంది. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కలేదు. అతను కరోనా బారినపడటమే అందుకు కారణం. ఆర్టీపీసీఆర్ టెస్టులో అశ్విన్ కు పాజిటివ్ రాగానే […]
టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో వెరీ వెరీ స్పెషల్ ప్లేయర్ ఎవరు అంటే.. మన తెలుగువాడైన వీవీఎస్ లక్ష్మణ్ పేరే వినిపిస్తుంది. మొత్తం కెరీర్ లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని లక్ష్మణ్ ఓ లెజండ్రీ క్రికెటర్ గా నిలవగలిగాడు. ప్రస్తుతానికి లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహస్తున్నాడు. అయితే.. త్వరలోనే టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అదేంటి..? ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ […]
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్తర్ తన మోచేతిని కదలిస్తూ బౌలింగ్ చేసేవాడని అని చెప్పిన సెహ్వాగ్.. అది నిబంధనలకు విరుద్ధమని చెప్పుకొచ్చాడు. అయినా ఐసీసీ మాత్రం అతనిపై ఏనాడు చర్యలు తీసుకోలేదని చెప్పాడు. హోమ్ ఆఫ్ హీరోస్ పేరిట ఓ చానెల్ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలో పాల్గొన్న సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే.. ఈ ఇంటర్వ్యూలో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ […]