టీమిండియా మాజీ సారథి, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి రికార్డులు కొత్తేమీ కాదు. సెంచరీల మీద సెంచరీలు బాదడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. బౌలర్ ఎవరు, ఫార్మాట్ ఏదనేది సంబంధం లేకుండా పరుగులు చేస్తుంటాడు విరాట్. అందుకే అతడ్ని ముద్దుగా ‘రన్ మెషీన్’ అని పిలుస్తుంటారు. అలాంటి కోహ్లీ ఇప్పుడు మరో రేర్ ఫీట్ ను అందుకున్నాడు. తనకిష్టమైన వన్డే ఫార్మాట్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో 12,500 పరుగుల మార్క్‌కు కోహ్లీ చేరుకున్నాడు. కేవలం 257 మ్యాచుల్లోనే అతడు ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కోహ్లీ తర్వాత సచిన్ టెండూల్కర్ 310, రికీ పాంటింగ్ 328 మ్యాచుల్లో 12,500 పరుగులు చేశారు. దీంతో వన్డేల్లో ఈ మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఇకపోతే, శ్రీలంకతో మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయం సరైనదేనని బ్యాటర్లు నిరూపించారు. స్వయంగా రోహిత్ శర్మే (83) లంక బౌలర్లను చీల్చి చెండాడాడు. అతడికి మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (70) మంచి సహకారం లభించింది. అయితే అర్ధ సెంచరీలు కొట్టిన తర్వాత వీళ్లిద్దరూ ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39) మాత్రం అదే ఊపును కొనసాగించారు.
ముఖ్యంగా విరాట్ కోహ్లీ (87 బంతుల్లో 113) లంక బౌలర్లపై అటాక్‌కు దిగాడు. మంచి బంతులను కూడా బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలో 80 బంతుల్లోనే ట్రిపుల్ డిజిట్‌ను అందుకుని.. తన కెరీర్లో 45వ సెంచరీని కొట్టేశాడు. రోహిత్, గిల్, విరాట్, రాహుల్ దెబ్బకు భారత్ 50 ఓవర్లలో 373 పరుగుల భారీ స్కోరు చేసింది. వికెట్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నప్పటికీ శ్రీలంకకు ఛేజింగ్ ఏమంత సులువు కాకపోవచ్చు. భారీ స్కోరు ఛేదించే క్రమంలో వికెట్లు కోల్పోతే కోలుకోవడం కష్టమే. అందులోనూ షమి, సిరాజ్ లాంటి పటిష్టమైన భారత బౌలింగ్ దళాన్ని ఎదుర్కొని నిలవడం లంక్ బ్యాట్స్‌మెన్‌కు కష్టంగానే కనిపిస్తోంది. మరి, లంకపై కోహ్లీ సెంచరీ, రేర్ ఫీట్‌ను అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The Celebration We All Wanted 🔥
Virat Kohli in ODI Cricket:•Matches – 266
•Innings – 257
•Runs – 12584
•Average – 57.72
•Hundreds – 45
•Fifties – 64
•Strike rate – 93.25G.O.A.T FOR REASON 🐐❤️🔥#ViratKohli𓃵 pic.twitter.com/1XM7elAvGy
— 𝙎𝙪𝙣𝙣𝙮. ♡̷̷ˎˊ˗ (@SunnyHunYaar) January 10, 2023