టీమిండియాలో ఫిట్నెస్ ప్రమాణాలు పెంచిన వారిలో విరాట్ కోహ్లీని ఒకడిగా చెప్పొచ్చు. కెరీర్ కొత్తలో కాస్త బొద్దుగా ఉన్న అతడు.. తర్వాత ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాడు. భోజన ప్రియుడిగా పేరున్న కోహ్లీ.. ఫిట్నెస్ కోసం తనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్‌ను పక్కన పెట్టేశాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు టీమిండియా చుక్కలు చూపిస్తోంది. సొంత గడ్డపై భారత్‌ను ఎదుర్కోవడం ఎంత కష్టమో మరోసారి నిరూపితం అవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన రెండు టెస్టుల్లో గెలిచి ట్రోఫీని ఆస్ట్రేలియాకు దక్కకుండా చేసింది. ఇక మిగిలిన రెండు టెస్టుల్లో టీమిండియాను ఆస్ట్రేలియా ఏ విధంగా ఎదుర్కోనుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాప్‌క్లాస్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌ను ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక సతమతమవుతోంది. మొదటి రెండు మ్యాచుల ఫలితాలను బట్టి చూస్తే ఈ సిరీస్‌లో కంగారూలకు వైట్‌వాష్ తప్పేలా లేదు. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఆ జట్టుకు అంతకుమించిన అవమానం మరొకటి ఉండదు.
ఇదిలా ఉండగా.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి అందరికీ తెలిసిందే. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విరాట్.. కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టులోని ఇతర ఆటగాళ్లను కూడా సాధ్యమైనంత ఫిట్‌గా మార్చే ప్రయత్నం చేశాడు. దాని ఫలితాలు గ్రౌండ్లో ఫీల్డింగ్ రూపంలో కనిపించాయి. ఇక, ఒకప్పుడు మంచి భోజన ప్రియుడైన కోహ్లీ.. ఫిట్నెస్ కోసం జంక్ ఫుడ్‌కు దూరమయ్యాడు. అయితే రీసెంట్గా ఆసీస్‌తో రెండో టెస్టు సందర్భంగా.. తనకు నచ్చిన ఆహారం వచ్చినప్పుడు విరాట్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాంటి అతడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ వీడియో సెషన్‌ను చేశాడు. ఇందులో ప్రస్తుతం తన డైట్ సీక్రెట్ ఏంటో చెప్పాడు. తాను శాకాహారినని కోహ్లీ తెలిపాడు.
‘చోలే కుల్చే’ అంటే తను ఎంతో ఇష్టమని విరాట్ చెప్పాడు. అయితే తాను ఎప్పటికీ తినని డిష్ కూడా ఒకటి ఉందన్నాడు. కాకరకాయను మాత్రం ఎప్పటికీ తిననని కోహ్లీ తెలిపాడు. గతంలో తాను రుచి చూసిన ఓ విచిత్ర వంటకం గురించి కూడా వివరించాడు. ‘గతంలో మలేసియాలో ఓ రకమైన కీటకపు వంటను కూడా రుచి చూశా. అయితే అదేంటో నాకు తెలియదు. దాన్ని ఫ్రై చేశారు. తిన్నాక మాత్రం చాలా అసహ్యమేసింది’ అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఇక, ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ మోస్తరుగా రాణించాడు. తొలి టెస్టులో అంతగా రాణించనప్పటికీ రెండో టెస్టులో మాత్రం ఫర్వాలేదనిపించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో 44 రన్స్ చేసి ఆదుకున్నాడు. రాబోయే మ్యాచుల్లో అతడు ఎలా ఆడతానేది చూడాలి.
Lesser-known facts!
Catch me spill the beans on food, fashion, and more on Ep 2!Click here to explore more of Wrogn- https://t.co/lG4lxBGW2o@StayWrogn#StayWrogn #ad pic.twitter.com/dMXwglq7To
— Virat Kohli (@imVkohli) February 20, 2023