భారత్‌తో మూడు వన్డేల సిరీస్ ముగిసిన మరుసటి రోజే ఇంగ్లండ్ జట్టు స్టార్ ఆల్‌రౌంటర్, టెస్టు జట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగే వన్డే ఈ ఫార్మాట్‌లో తన చివరి మ్యాచ్ అని సోమవారం ప్రకటించాడు. బెన్‌స్టోక్స్ నిర్ణయం అందరిని షాక్‌కు గురిచేసింది.
మూడు ఫార్మాట్లలో కొనసాగేందుకు తన శరీరం సహకరించడం లేదని అందుకే వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు స్టోక్స్ పేర్కొన్నాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టును స్టోక్స్ అనేక మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో గెలిపించాడు. 2019 వరల్డ్ కప్ ఇంగ్లండ్ గెలిచిందంటే అందులో స్టోక్స్ పాత్ర ఎంతో కీలకమని చెప్పవచ్చు.
ఇటివల న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌తో స్టోక్స్ ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. కెప్టెన్‌గా తొలి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం, ఆ తర్వాత భారత్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్ట్‌లో విజయం సాధించడంతో స్టోక్స్ టెస్టుల్లో ఇంగ్లండ్‌ను సమర్థవంతం నడిపించగలడనే నమ్మకం వచ్చింది. అలాగే వన్డే, టీ20ల్లో కూడా తన ఆల్‌రౌండర్ పాత్రను అంతే సమర్థంగా పోషిస్తాడని ఇంగ్లండ్ టీమ్ భావించగా.. వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి వారికి షాకిచ్చాడు.
కానీ.. స్టోక్స్ నిర్ణయాన్ని గౌరవిస్తూ.. తనకు చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలిపారు. అందులో ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించిన తీరు ప్రస్తుతం వైరల్‌గా మారింది. బెన్‌స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటనకు కోహ్లీ చేసిన కామెంట్ హార్ట్ టచ్చింగ్‌గా ఉంది. ‘నేను ఇప్పటి వరకు ఆడిన వారిలో అత్యుత్తుమ కాంపిటీటర్.. నీ పట్ల ఎంతో గౌరవం ఉంది’ అంటూ కోహ్లీ.. స్టోక్స్‌ను ఉద్దేశిస్తూ కామెంట్‌లో పేర్కొన్నాడు.
కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడు స్టోక్స్‌ను ఇంతలా కీర్తించడం నిజంగానే విశేషం. ప్రస్తుతం బ్యాడ్‌ఫామ్‌లో ఉన్న కోహ్లీపై విమర్శకులు విరుచుకుపడుతున్నా అవేవి పట్టించుకోని కోహ్లీ.. తన పని తాను చేసుకునిపోతున్నాడు. ఈ నెల 22 నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న వన్డే, టీ20 సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. మరి బెన్‌స్టోక్స్ రిటైర్మెంట్‌పై కోహ్లీ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
❤️🏴 pic.twitter.com/xTS5oNfN2j
— Ben Stokes (@benstokes38) July 18, 2022