టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తప్పిస్తూ రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వడంపై ఎలాంటి అభ్యంతరాలు రావడంలేదు గానీ.. కోహ్లీకి కనీసం సమాచారం ఇవ్వకుండా తప్పించడంపై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో దాదాపై తీవ్ర విమర్శలు చేస్తూ.. కోహ్లీని కెప్టెన్‌గా తప్పించడంపై ఫైర్ అవుతున్నారు. క్రికెట్ నిపుణులు కూడా కోహ్లీ ఫ్యాన్స్‌కు మద్దతు పలుకుతున్నారు.
వాస్తవానికి వన్డేలో కెప్టెన్‌గా రికార్డులను చూసినా.. భారత క్రికెట్‌లో విజయవంతమైన కెప్టెన్లుగా పేరుతెచ్చుకున్న మాజీలు సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోని కంటే కూడా మెరుగైన రికార్డ్‌లను కలిగి ఉన్నాడు. 1999-2005 మధ్య కాలంలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న గంగూలీ సారథ్యంలో భారత్ 147 వన్డేలు ఆడితే 76 విజయాలు, 66 ఓటములు, 4 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. విన్నింగ్ పర్సంటేజ్ 53.52. 2007-2018 మధ్య కాలంలో ధోని సారథ్యంలో టీమిండియా 200 వన్డేలు ఆడితే 110 విజయాలు, 74 ఓటములు, 5 టై, 11 ఫలితం తేలని మ్యాచ్‌లతో 59.52 విన్నింగ్ పర్సంటేజ్ నమోదు చేశాడు.
Virat Kohli, one of the most successful ODI captains 🇮🇳 pic.twitter.com/Esapj3YOyQ
— ESPNcricinfo (@ESPNcricinfo) December 9, 2021
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 95 వన్డేలు ఆడిన టీమిండియా ఏకంగా 65 మ్యాచ్‌లలో విజయం సాధించి, కేవలం 27 మ్యాచ్‌లలో మాత్రమే ఓడింది. ఒక మ్యాచ్ టై కాగా, 2 ఫలితం రాలేదు. విన్నింగ్ పర్సంటేజ్ 70.43 ఇది దాదా, ధోని కంటే ఎక్కువ. అలాగే విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా భారత్ 19 వన్డే సిరీస్‌లు ఆడితే అందులో 15 సిరీస్‌లను గెలిచింది. ఈ గణాంకాలను చూపుతూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గంగూలీపై మండిపడుతున్నారు. ఒక్క ఐసీసీ ట్రోఫీ లేదన్న అవవాదు తప్ప వన్డే కెప్టెన్‌గా కోహ్లీకి తిరుగులేదు.
Alone always @imVkohli 🐐#ShameonBCCI pic.twitter.com/5mxBgrUEZq
— stylish BUMbaikar (@itschaos____) December 9, 2021
అంతగా కెప్టెన్‌ను మార్చాలని బీసీసీఐ భావిస్తే విరాట్‌ను సంప్రదించాల్సిందని.. అతనికి ఆలోచించుకోనేందుకు అవకాశం కల్పించాల్సిందని ఫ్యాన్స్ అంటున్నారు. వాస్తవానికి విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీని తనే వదులుకున్నాడు. వన్డే కెప్టెన్సీ కూడా అలాగే హుదాగా వదులుకునే వాడేమో కదా? ఇలా ఉన్న పళంగా తొలగిస్తే.. టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు అందించిన ఆటగాడిని అవమానించినట్లు కాదా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. జట్టు మొత్తం విఫలమైన సందర్భాల్లో కూడా విరాట్ ఒంటరి పోరాటం చేసి భారత్‌కు విజయాలు అందించాడని, ఇండియా 2011 వరల్డ్ కప్ గెలవడంలో విరాట్ కోహ్లీ పాత్ర మరువలేనిదని అంటున్నారు. మరి కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
You are always my captain ♥️🙏@imVkohli https://t.co/LpSPVv00PX pic.twitter.com/aOT0zywWpR
— Guddu pandit 🥚 (@vkholic18) December 8, 2021
1 RT = 1 SLAP ON Ganguly and Jay Shah’s face#ShameonBcci pic.twitter.com/Xp3KAcCzaS
— Gaurav🕊️ (@Kohli4ever) December 9, 2021
Ppl who ruined Indian cricket 👇 #ShameonBCCI pic.twitter.com/z9038voqsy
— Cricfam (@cricfam) December 9, 2021
These two have ruined ind cricket. Holding illegal positions, lack of communication in everything, media leaks, nothing regarding women’s IPL. Worst era in bcci reg administration#ShameonBCCI pic.twitter.com/nvfPYFIJc1
— A (@_shortarmjab_) December 9, 2021
No one can achieve even 10% what Virat achieve #ShameonBcci insecurity level pic.twitter.com/CWjo5eL6gy
— V. (@ViratOfc) December 9, 2021