Virat Kohli: కోహ్లీ సెంచరీ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన అభిమానుల ఆశలు ఫలించాయి. నెలరోజుల విశ్రాంతి తర్వాత అదిరిపోయే ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించిన కోహ్లీ.. దుబాయ్ వేదికగా అఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభం నుంచి డూకుడుగా ఆడిన కోహ్లి.. 53 బంతుల్లో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకిది తొలి సెంచరీ కావడం విశేషం. సెంచరీ చేశాక కోహ్లీ కాస్త ఎమోషనల్ అయ్యాడు.
రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్ అవతరమెత్తిన కోహ్లీ ఆరంభం నుంచి డూకుడుగా ఆడాడు. రాహుల్ (62)తో కలిసి జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించిన కోహ్లీ.. ఆ తర్వాత పంత్ (19 నాటౌట్)ను ఒక ఎండ్‌లో నిలబెట్టి మరో ఎండ్‌లో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో నెట్టింట కోహ్లీ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 122 పరుగులు చేశాడు కోహ్లీ. ఆపై.. ఇన్నింగ్స్ అయ్యాక మీడియా ప్రెసెంటేషన్ లో పాల్గొన్న కోహ్లీ.. తన సెంచరీని అనుష్కకు, వామికకు అంకితం ఇస్తూ ఎమోషనల్ అయ్యాడు.
“గత రెండున్నరేళ్లుగా నేను చాలా అనుకున్నాను. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది. కాకుంటే.. నేను ఊహించని ఫార్మాట్ లో సెంచరీ చేయడంతో.. నేను కాస్త షాక్ అయ్యాను. ఇదంతా దేవుడి ఆశీర్వాదం. నవంబర్‌లో నాకు 34 ఏళ్లు నిండబోతున్నాయి. ఈ సమయంలో సెంచరీ చేయడం చాలా సంతోషం. ప్రస్తుతం నేను మీముందు.. ఇలా నిలబడి ఉన్నానంటే దానికి కారణం అనుష్క. కష్ట సమయాల్లో నాకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి అనుష్క. ఈ వంద ఆమెకు మరియు మా చిన్న కుమార్తె వామికకు ప్రత్యేకంగా అంకితం”.
Virat Kohli dedicates his 71st international century to his wife Anushka Sharma and daughter Vamika ❤️#CricTracker #INDvAFG #AsiaCup2022 #ViratKohli pic.twitter.com/XFRzHbNlqC
— CricTracker (@Cricketracker) September 8, 2022
“అందరూ.. నేను వంద చేయట్లేదనే మాట్లాడుతున్నారు కానీ, దేవుడు ఇప్పటికే నాకు ఎంతో ఇచ్చాడు. విశ్రాంతి తీసుకున్నాక.. నేను రిఫ్రెష్ అయ్యాను. మానసికంగా, శారీరకంగా ఎంత అలసిపోయానో అర్థం చేసుకున్నాను. ఇక్కడికి వచ్చాక, నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టినపుడు, నా పాత రిథమ్ తిరిగి వస్తున్నట్లు అనిపించింది. అందువల్లే ఈ ప్రదర్శనల చేయగలిగా” అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
The milestone we’d all been waiting for and here it is!
71st International Century for @imVkohli 🔥💥#AsiaCup2022 #INDvAFGpic.twitter.com/hnjA953zg9
— BCCI (@BCCI) September 8, 2022
ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. కోహ్లీ సెంచరీ(122)కి తోడు.. కేఎల్ రాహుల్(62, 41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు పరువు కోసం పోరాడుతోంది. 7 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్ పై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Incredible scenes as Virat Kohli completed his 71st international century.#ViratKohli #KingKohli #INDvAFG #AsiaCup2022 #AsiaCupT20 #INDvsAFG pic.twitter.com/p6I04NetOl
— newspointJ&K (@NewspointjK) September 8, 2022