Virat Kohli: కోహ్లీ సెంచరీ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన అభిమానుల ఆశలు ఫలించాయి. నెలరోజుల విశ్రాంతి తర్వాత అదిరిపోయే ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించిన కోహ్లీ.. దుబాయ్ వేదికగా అఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభం నుంచి డూకుడుగా ఆడిన కోహ్లి.. 53 బంతుల్లో సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకిది తొలి సెంచరీ కావడం విశేషం. సెంచరీ చేశాక కోహ్లీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్ అవతరమెత్తిన […]
అఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచులో విరాట్ కోహ్లీ(122) అద్భుతమైన సెంచరీ సాధించాడు. టీమిండియా టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాక.. భారత అభిమానులకు సంతోషాన్నిచ్చే వార్త ఇదొక్కటే. రెగ్యులర్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో ఓపెనర్ అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఏ బాల్ వేసినా బౌండరీ అన్నట్లుగా.. కోహ్లీ బ్యాటింగ్ సాగింది. దుబాయ్ వేదికగా నామమాత్రపు మ్యాచులో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతోంది. ఈ మ్యాచులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ […]