అఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచులో విరాట్ కోహ్లీ(122) అద్భుతమైన సెంచరీ సాధించాడు. టీమిండియా టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాక.. భారత అభిమానులకు సంతోషాన్నిచ్చే వార్త ఇదొక్కటే. రెగ్యులర్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో ఓపెనర్ అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఏ బాల్ వేసినా బౌండరీ అన్నట్లుగా.. కోహ్లీ బ్యాటింగ్ సాగింది.
దుబాయ్ వేదికగా నామమాత్రపు మ్యాచులో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతోంది. ఈ మ్యాచులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో ఓపెనర్ గా వచ్చాడు.. విరాట్ కోహ్లీ. మొదట్లో కాస్త నిలకడగా ఆడినా.. క్రీజులో కుదురుకున్నాక బౌండరీల వర్షం కురిపించాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 పరుగులు చేశాడు. మొత్తానికి భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది.
💯💝 @imVkohli pic.twitter.com/qi8fYmW1vO
— Thala ⚒️ (@SattiPreetham) September 8, 2022
After 1020 + days
After 80+ innings
He scored 71 St century
The name King Kohli @imVkohli the king is back
💥💥💥💥🔥🔥🔥🔥🔥😭❤️❤️#ViratKohli𓃵 #AFGvsIND #INDvsAFG pic.twitter.com/sVPGTRo1H4— Sachin singh (@S_Ac_Hi_N_) September 8, 2022