టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో ఎంత ఎనర్జీగా ఉంటాడో తెలిసిందే. మరోసారి తనలోని ఎంటటైన్ ఫెలోను చూపించాడు కోహ్లీ. ఆర్సీబీ జట్టు సభ్యుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇటివల భారతీయ యువతిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మ్యాక్సీ జట్టు సభ్యులకు తన వెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి ఆర్సీబీ టీమ్ అంతా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ఈ వేడకలో విరాట్ కోహ్లీ, ఆర్సీబీ యంగ్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్‌తో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు వేశాడు. వీరి డాన్స్ చూసి ఫిన్ ఆలెన్ మాత్రం పడిపడి నవ్వుకున్నాడు.
ప్రస్తుతం కోహ్లీ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్‌లో కోహ్లీ బ్యాడ్‌ఫామ్ చూసి ఒకింత దుఃఖంలో ఉన్న కోహ్లీ ఫ్యాన్స్.. ఈ డాన్స్ చూసి మాత్రం కాస్త రిలాక్స్ అయ్యారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం అవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు వరుస మ్యాచ్‌లలో గోల్డెన్ డక్ కూడా అయ్యాడు. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లీ.. 10 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ నెల 30న బలమైన గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ తమ 10వ మ్యాచ్ ఆడనుంది. మరి ఈ మ్యాచ్‌తోనైన కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడో? లేదో? చూడాలి. ఇంతటి కఠిన పరిస్థితిలో ఉన్నా కూడా కోహ్లీ ఇంత ఉత్సహంగా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒక గొప్ప ఆటగాడి మానసిక స్థితి అతని బ్యాడ్ టైమ్‌లోనే తెలుస్తుందని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి కోహ్లీ డాన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: IPL తర్వాత కోహ్లీకి విశ్రాంతి! సెలెక్టర్స్ ప్లాన్ అదేనా?
Mood 😎 @imVkohli @RCBTweets #IPL #IPL2022 #ViratKohli #CricketTwitter #RCB #PlayBold pic.twitter.com/pWwYYSFFq0
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) April 27, 2022
Wedding vibes at the RCB camp last evening as we got together to celebrate #MaxiVins with a nice touch of Indian tradition. #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/MuvvGYTf4l
— Royal Challengers Bangalore (@RCBTweets) April 28, 2022
We wish @vini_raman and @Gmaxi_32 a lifetime of togetherness, peace, happiness and adventure!
PS: More pics and videos to follow.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/M43aTw9Jrr
— Royal Challengers Bangalore (@RCBTweets) April 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.