బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఆరంభంలోనే మొహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టి బంగ్లాను దెబ్బతీయగా.. జమ్మూ ఎక్స్‌ప్రెస్, స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ అయితే మెరుపు బౌలింగ్‌తో.. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను గడగడలాడించాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌తో ఎటాక్‌లోకి వచ్చిన ఉమ్రాన్.. తనకు మాత్రమే సాధ్యమైన జెడ్ స్పీడ్ వేగంతో షకీబ్‌ను భయపెట్టాడు. ఏకే 47 నుంచి బుల్లెట్లు వస్తున్నట్లు.. ఉమ్రాన్ నుంచి బంతులు దూసుకురావడంతో బ్యాట్ అడ్డుపెట్టేందుకు కూడా షకీబ్ ప్రయత్నించలేదు. అందులోనూ.. డెడ్లీ బౌన్సర్లతో షకీబ్‌ను మరింత ఇబ్బంది పెట్టాడు.
ఉమ్రాన్ వేస్తున్న బౌన్సర్లకు సమాధానంలేని షకీబ్.. బంతులను వదిలేసేందుకు ఆపసోపాలు పడ్డాడు. తొలి బంతి వికెట్ల పైనుంచి చాలా దగ్గరగా వెళ్లింది. రెండో బంతి షకీబ్ రిబ్స్‌కు తగిలింది. మూడో బంతికి కూడా బౌన్సర్ వేయడంతో తప్పించుకునేందుకు వేరే దారిలేక షకీబ్ పూర్తిగా కిందకూర్చున్నాడు. ఇక చివరి బంతి అయితే ఏకంగా అతని హెల్మెట్‌కు బలంగా తగిలింది. దెబ్బకు షకీబ్ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. వెంటనే హెల్మెట్ తీసి.. తలకు గాయం అయిందా అని చెక్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్, ఉమ్రాన్ మాలిక్ సైతం షకీబ్ దగ్గరికి వెళ్లి.. గట్టిగా తగిలిందేమోనని అడిగి తెలుసుకున్నారు. కాగా.. ఉమ్రాక్ మాలిక్ స్పీడ్‌తో క్రికెట్ అభిమానులకు వినోదం అందిస్తూ.. బంగ్లా బ్యాటర్లను భయపెడుతున్నాడు.
ఇక రెండో ఓవర్ వేసిన ఉమ్రాన్ తొలి బంతిని ఏకంగా గంటకు 151 కిలో మీటర్ల వేగంతో వేసి.. నజ్ముల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఉమ్రాన్ స్పీడ్క్ ఆఫ్ స్టెంప్ ఎగిరి అంత దూరంలో పడింది. ఇప్పటి వరకు రెండు ఓవర్లు వేసిన ఉమ్రాన్ కేవలం 5 పరుగులు ఇచ్చి.. ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఓవర్‌ను మెయిడెన్‌గా వేయడం విశేషం. అయితే.. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో గాయపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతి గాయానికి స్కానింగ్ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. మ్యాచ్‌లో ఇప్పటి వరకు 15 ఓవర్లు పూర్తికాగా.. బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. సిరాజ్ రెండు, ఉమ్రాన్ ఒక వికెట్ తీసుకున్నారు. కాగా.. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తొలి వన్డేలో ఓడిన విషయం తెలిసిందే.
The Jammu Express of India – Umran Malik. pic.twitter.com/1iLigKXooB
— Johns. (@CricCrazyJohns) December 7, 2022
THAT’S RAW PACE FOR YOU. FUCKING 151 KMPH. Umran Malik you beauty. ❤️ pic.twitter.com/TW0X4hdagf
— ” (@Sobuujj) December 7, 2022