భారత క్రికెటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ గురించి అందరికీ తెలిసు. కానీ అతని వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదం గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. 2004లో భారత జట్టులోకి అరంగ్రేటం చేసిన.. దినేష్ కార్తీక్ తన వ్యక్తిత్వంతో, తన ఆటతీరుతో.. అందరి మనసులను గెలుచుకున్నాడు. ఇదంతా నాణానికి ఓవైపు అయితే.. మరోవైపు పుట్టెడు దు:ఖం ఉంది. మొదటి భార్య చేతిలో దారుణంగా మోసపోయి పిచ్చోడిలా మారిన అతను రెండో భార్య ప్రేమతో మళ్లీ మనిషయ్యాడు.
మురళీ విజయ్, దినేశ్ కార్తీక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. దేశవాళీ టోర్నీల్లో చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహారించిన దినేశ్ కార్తీక్, 2007లో తన చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజరను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి తమిళనాడు క్రికెటర్‌గా ఉన్న మురళీ విజయ్ కూడా హాజరయ్యాడు.ఆ చనువుతో మురళీ విజయ్, దినేశ్ కార్తీక్ ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ మొదటి భార్య నికితాతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయం కార్తీక్‌కు తప్పా తమిళనాడు టీమ్ మొత్తానికి తెలుసు.
ఒకరోజు అతని మొదటి భార్య ఈ విషయాన్ని కార్తీక్‌కు తెలియజేసింది. మురళీ విజయ్ కారణంగా గర్భం దాల్చినట్లు చెప్పి విడాకులు ఇవ్వాలని కోరింది. ఆమె మురళీ విజయ్‌తో సహజీవనం మొదలుపెట్టింది. భార్య తనను మోసం చేసిందన్న బాధకంటే, తన స్నేహితుడు చేసిన మోసాన్ని దినేశ్ కార్తీక్ తట్టుకోలేకపోయాడు. దేవదాస్‌లా మారాడు. ఆటమీద ద్రుష్టి పోయింది. సహచర ఆటగాళ్ల చేత అవమానానికి గురవ్వడమే కాదు.. టీమిండియాలో చోటు కోల్పోవడంతో పాటు తమిళనాడు కెప్టెన్సీ బాధ్యతలను కోల్పోయాడు. చివరకి జీవితం మీద విరక్తి చెంది.. ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న దినేశ్ కార్తీక్ ట్రైనర్.. అతని ఇంటికెళ్లి వ్యక్తిగతంగా కలిశాడు. జీవితంపై ఆశలు పెంచి మళ్లీ ట్రైనింగ్ మొదలుపెట్టేలా చేసాడు. ట్రైనర్ సూచనలతో జిమ్ చేయడం మొదలుపెట్టిన దినేశ్ కార్తీక్‌కు అక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్న భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ పరిచయమైంది. పెళ్లికి ముందు క్రికెటర్లు అంటేనే అసహ్యించుకునే దీపికా, దినేశ్ కార్తీక్ వ్యక్తిత్వాన్ని చూసి మనసు పారేసుకుంది. ట్రైనర్‌తో కలిసి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. కార్తీక్ ను.. ఆ బాధల నుండి బయటపడేయడమే కాదు.. భారత జట్టుకు మరలా ఎంపికయ్యేలా ప్రోత్సహించింది. ఈ జంటకు ఇప్పుడు కవల పిల్లలు. జీవితంలో ఎదురైన కష్టాలకు కుంగిపోకుండా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనడానికి కార్తీక్ జీవితమే ఓ ఉదహారణ. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఒకప్పుడు ధోనీతో ఆడాడు.. ఇప్పుడు డ్రైవర్ గా.. శ్రీలంక క్రికెటర్ దీనస్థితి!
ఇది కూడా చదవండి: Ajinkya Rahane: రెండోసారి తండ్రి కాబోతున్న క్రికెటర్ రహానే!..