తన కెరీర్‌లో మొత్తం 61 టెస్టులు ఆడి.. 3982 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 17 వన్డేల్లో 339 రన్స్, 9 టీ20ల్లో 169 పరుగులు చేశాడు. అనంతరం పూర్ ఫామ్‌తో జట్టులో స్థానం కోల్పోయిన క్రికెటర్‌ను రవిచంద్రన్ అశ్విన్.. టెస్టుల్లో గ్రేటెస్ట్ ఇండియన్ ఓపెనర్‌గా పేర్కొన్నాడు.
క్రికెట్ లో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన ఆటగాళ్లు.. కొంత కాలం తర్వాత తమ ఆటకు వీడ్కోలు పలకడం సాధారణ విషయమే. ఇక తమ రిటైర్మెంట్ పోస్ట్ లో భావొద్వేగపూరితమైన మాటలను పంచుకుంటుంటారు ఆటగాళ్లు. ఈ క్రమంలోనే తమ కెరీర్ కు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలుపుతారు. అయితే ఈ రిటైర్మెంట్ కాపీని ఆటగాళ్లు సొంతగా రాసుకుంటారు. కానీ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన ఓ టీమిండియా క్రికెటర్ వీడ్కోలు కాపీ.. మరో ఆటగాడి రిటైర్మెంట్ కాపీని మక్కీకి […]
భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ మురళీ విజయం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశాడు. 2018 నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న మురళీ విజయ్ కొద్దిరోజుల క్రితమే బీసీసీపై తన అసహనాన్ని వెళ్లగక్కాడు. బీసీసీఐతో అనుబంధం ముగిసిందంటూ.. విదేశీ లీగుల్లో ఆడటం కోసం ఎదురుచూస్తున్నట్లుగా ప్రకటన చేశాడు. ఇది జరిగిన వారం రోజులకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. “బీసీసీఐతో నా అనుబంధం దాదాపు ముగిసింది. […]
వీరేంద్ర సెహ్వాగ్.. వరల్డ్ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్ గా తనకంటూ ప్రత్యేక పేరును లిఖించుకున్నాడు. బౌలర్ ఎవరన్నది సెహ్వాగ్ కు అనవసరం.. బౌండరీ బాదామా లేదా అన్నదే వీరేంద్రుడి తత్వం. మరి అలాంటి డ్యాషింగ్ బ్యాటర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ఓపెనర్. సెహ్వాగ్ లా తనకూ యాజమాన్యం మద్ధతు లభించి ఉంటే.. నా కెరీర్ కూడా వేరేలా ఉండేదని వాపోయాడు. మేనేజ్ మెంట్ వీరూ భాయ్ కు ఇచ్చినంత స్వేచ్ఛ నాకు […]
టెస్టు స్పెషలిస్ట్ మురళీ విజయ్ టీమిండియాలో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. కానీ, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో మాత్రం విజయ్ పరుగుల వరద పారిస్తున్నాడు. కానీ, ఇటీవల మురళీ విజయ్ కి తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఓ ఛేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. గ్యాలరీలోని కొందరు డీకే అభిమానులు డీకే డీకే అంటూ నినాదాలు చేశారు. దినేష్ కార్తీక్‌కి మురళీ విజయ్‌కి మధ్య అంత గొప్ప సత్సంబంధాలు లేవని అందరికీ తెలుసు. ఆ విషయం […]
భారత క్రికెటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ గురించి అందరికీ తెలిసు. కానీ అతని వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదం గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. 2004లో భారత జట్టులోకి అరంగ్రేటం చేసిన.. దినేష్ కార్తీక్ తన వ్యక్తిత్వంతో, తన ఆటతీరుతో.. అందరి మనసులను గెలుచుకున్నాడు. ఇదంతా నాణానికి ఓవైపు అయితే.. మరోవైపు పుట్టెడు దు:ఖం ఉంది. మొదటి భార్య చేతిలో దారుణంగా మోసపోయి పిచ్చోడిలా మారిన అతను రెండో భార్య ప్రేమతో మళ్లీ మనిషయ్యాడు. […]
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ మురళీ విజయ్.. జాతీయ జట్టులో స్థానం కోల్పోయి చాలా రోజులు గడిచిపోయాయి. అయినప్పటికి.. మురళీ విజయ్ మైదానంలో తన సత్తా చాటుతూనే ఉన్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రూబీ ట్రిచీ వారియర్స్ కు ఆడుతున్న విజయ్.. పరుగుల వరద పారిస్తున్నాడు. నెల్లాయి కోవై కింగ్స్ తో జరిగిన మ్యాచులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే ఇంతలోనే మురళీ విజయ్ చేదు అనుభవం ఎదురైంది. మురళీ విజయ్ జీవితంలో జరిగిన ఒక సంఘటనపై అభిమానులు […]