రవిచంద్రన్ అశ్విన్.. క్రికెట్‌లో ఇతనో మాస్టర్‌మైండ్. రూల్ అంటే రూలే అనే సిద్ధాంతంతో ఆడే క్రికెటర్. తొలిసారి మన్కడింగ్ చేసి సంచలనం సృష్టించినా.. హై ప్రెషర్ భారత్-పాక్ మ్యాచ్‌ల్లో ఒక్క బాల్‌కు రెండు రన్స్ అసవరమైన దశలోనూ.. ఎంతో కూల్‌గా తెలివిగా వైడ్‌ను దాని దారిన దాన్ని పోనిచ్చినా.. అశ్విన్ స్టైలే వేరు. అందుకే అంతన్ని మాస్టర్‌మైండ్ అంటుంటారు. పక్కా లెక్క ప్రకారం క్రికెట్ ఆడే అశ్విన్.. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం మిల్లర్‌పై కాస్త జాలి చూపించాడు. ఇప్పుడు ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. అశ్విన్ కావాలనే మిల్లర్‌ను అవుట్ చేయలేదని కొంతమంది క్రికెట్ అభిమానులు ముఖ్యంగా పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మరి నిజంగానే అశ్విన్ కావాలనే మిల్లర్ అవుట్ చేయలేదా? అసలు అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు తెలుసుకుందాం..
సౌతాఫ్రికా విజయానికి 13 బంతుల్లో 12 పరుగులు అవసరమైన సమయంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతి వేసేందుకు రవిచంద్రన్ అశ్విన్ సిద్ధమయ్యాడు. కానీ.. బాల్ రిలీజ్ చేసే టైమ్‌లో ఎందుకో ఆగిపోయాడు. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న డేవిడ్ మిల్లర్ అప్పటికే క్రీజ్ దాటి కాస్త ముందుకు వెళ్లాడు. తిరిగి వెళ్లూ ఈ విషయాన్ని గమనించిన అశ్విన్.. మిల్లర్ బ్యాట్ బయట ఉన్న దృశ్యాన్ని చూస్తూ.. మిల్లర్ వైపు ఒక లుక్ ఇచ్చాడు. అరే.. మిల్లర్‌ను మన్కడింగ్ ద్వారా రనౌట్ చేసే ఛాన్స్ ఉంది కదా.. అశ్విన్ ఎందుకు అవుట్ చేయలేదని అంతా భావించారు. కానీ.. అశ్విన్ అక్కడ ఆగింది.. తన బౌలింగ్ యాక్షన్ సరిగ్గా కుదరగా ఆగిపోయాడు. అంతేకానీ.. మిల్లర్‌ను మన్కడింగ్ చేద్డామని కాదు.
అయినా.. అప్పటికీ మిల్లర్ బ్యాట్ క్రీజ్‌కు రెండు ఇంచుల బయట మాత్రమే ఉంది. బాల్ రిలీజ్ కాకముందు మిల్లర్ ఉద్దేశపూర్వకంగా మరీ అంతముందుకు ఏం వెళ్లలేదు. అందుకే అశ్విన్ మన్కడింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. కానీ.. టీమిండియా సౌతాఫ్రికాపై విజయం సాధించాలని కోరుకున్న పాకిస్థాన్ ఫ్యాన్స్.. అలా జరగకపోవడంతో తమ కోపాన్ని ఈ విధంగా అశ్విన్‌పై ప్రదర్శిస్తున్నారు. అశ్విన్ కావాలనే మిల్లర్‌ను అవుట్ చేయలేదని అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించడంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. టీమిండియా మరో మ్యాచ్ గెలిస్తే.. పాక్ ఇంటికే. ప్రస్తుతం మిగిలి ఉన్న మ్యాచ్‌ల పరంగా చూస్తే.. పాకిస్థాన్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయంగా కనిపిస్తోంది.
#Ashwin anna almost mankads Miller pic.twitter.com/4H1bxE5yfU
— Raj (@Raj54060705) October 30, 2022
Ravichandran Ashwin Avoids Running Out David Miller At Non-Striker’s End In T20 World Cup Game. Watch https://t.co/GIi6Fv0nNG
— Newsonline (@Newsonl45817660) October 30, 2022