టీ20 వరల్డ్ కప్ 2022.. మినీ సంగ్రామం.. ఓ మహా సంగ్రామాన్నే తలపిస్తోంది. సూపర్ 12 మ్యాచ్ లన్ని ముగిశాయి. సెమీస్ లో టీమిండియా-ఇంగ్లాండ్, పాక్-న్యూజిలాండ్ జట్లు తలపడడానికి సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్ కు భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. సెమీస్ కోసం నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆటగాళ్లు. ఈక్రమంలోనే టీమిండియా సారథి రోహిత్ శర్మ కు గాయం అయ్యింది. దాంతో టీమిండియా శిబిరంలో ఆందోళన మెుదలైంది. కీలక మ్యాచ్ కు ముందు గాయం బారిన పడటంతో అభిమానుల్లో టెన్షన్ మెుదలైంది. అటు ఇంగ్లాండ్ జట్టులో సైతం స్టార్ ఆటగాడు డేవిడ్ మలన్ సైతం గాయం కారణంగా మ్యాచ్ కు దూరం అయిన సంగతి తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. సెమీస్ లో పాక్-కివీస్, ఇండియా-ఇంగ్లాండ్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం పోరాటానికి సిద్దమైయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆప్షనల్ ట్రైనింగ్ లో భాగంగా మంగళవారం ఉదయాన్నే ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు భారత ఆటగాళ్లు. ఈ క్రమంలో నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. రోహిత్ మోచేయికి గాయం కావడంతో వెంటనే ఫిజియో వచ్చి అతడికి ప్రథమ చికిత్స అందించాడు. ఆ తర్వాత అతడు ప్రాక్టీస్ ను వదిలి వెళ్లిపోయాడు. నెట్ బౌలింగ్ స్పెషలిష్ట్ రఘు బౌలింగ్ లో రోహిత్ గాయపడ్డాడు. దీంతో అటు టీమిండియాలో.. ఇటు భారత అభిమానుల్లో ఆందోళన పట్టుకుంది.
A huge INJURY SCARE for India
Captain Rohit Sharma has been hit on the right forearm while batting in the nets. Here is he being treated by the physio.
Extent of the injury is not yet known#INDvENG #RohitSharma pic.twitter.com/BHoj0BzFqN
— HT Sports (@HTSportsNews) November 8, 2022
అయితే ప్రస్తుతానికి రోహిత్ గాయం పై యాజమాన్యం ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఒక వేళ గాయం కనుక పెద్దది అయితే రోహిత్.. ఇంగ్లాండ్ తో జరిగే సెమీస్ కు దూరం కాక తప్పదు. అలా జరగకూడదని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. అయితే కీలక మ్యాచ్ లకు ముందు కెప్టెన్ గాయపడటం.. ఆ జట్టుకు ఒకరకంగా పెద్ద దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే ఆటగాళ్లలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపడంలో సారథిదే కీలక పాత్ర. మరో వైపు ఇంగ్లాండ్ కీలక ఆటగాడు అయిన డేవిడ్ మలన్ సైతం గాయం కారణంగా సెమీస్ కు దూరం అయిన విషయం తెలిసిందే. ఇలాంటి మెగా టోర్నీలో గాయాలు జట్టు విజయాలకు అడ్డంకిగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.