ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా విఫలమైన విషయం తెలిసిందే. సూపర్ 12 స్టేజ్‌లో బాగానే రాణించిన టీమిండియా.. సెమీస్‌కి వచ్చేసరికి తేలిపోయింది. పటిష్టమైన ఇంగ్లండ్‌తో సెమీస్‌లో దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో భారత జట్టుపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. చెత్త బౌలింగ్, చెత్త కెప్టెన్సీతోనే టీమిండియా వరల్డ్ కప్‌లో విఫలమైందని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై, రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారీ ట్రోలింగ్ కూడా జరుగుతోంది. […]
15 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు.. ఎన్నో కలలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా.. సెమీస్‌లో పోరాటం ముగించి తిరుగుపయనమైంది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022లో సూపర్ 12లో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో గ్రూప్ బీ టాపర్‌గా సెమీస్ చేరిన భారత్.. అడిలైడ్ వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో పరాజయం పాలైంది. దీంతో వరల్డ్ కప్‌లో టీమిండియా పోరాటం ముగిసింది. ఎప్పుడో 2007లో టీ20ల్లో తొలి వరల్డ్ కప్‌ను నెగ్గిన టీమిండియా.. మళ్లీ ఆ […]
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పోరాటం ముగిసింది. గురువారం అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా దారుణ ఓటమిని మూటగట్టుకున్నా.. బ్యాటింగ్‌లో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడి.. భారత్‌కు ఆ మాత్రం స్కోర్ అయినా అందించాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 63 పరుగులు చేసి.. చివరి ఓవర్లలో పాండ్యా […]
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పోరాటం ముగిసింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచులో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓడింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు వీరబాదుడుకు.. భారత బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఒకానొక సమయంలో మేం వేయలేం అన్నట్లుగా బౌండరీల దగ్గరకి వెళ్లి నిల్చుండిపోయారు. ఈ సమయంలో అందరకి గుర్తొచ్చిన ఒకే ఒక్కడు.. మహేంద్ర సింగ్ ధోని. లక్ష్యాన్ని నిర్ధేశించడం కాదు.. దాన్ని ఎలా కాపాడుకోవాలన్నది ధోనీని చూసి నేర్చుకోవాల్సిందే. అందుకే.. టీమిండియా ఓటమి అంచుల్లో నిలవగానే ఫ్యాన్స్ […]
భారత జట్టంటే.. ఒక జట్టు కాదు. ఒకేసారి మూడు జట్లను బరిలోకి దించగలదు. మూడు నెలల క్రితం భారత జట్టును ఉద్దేశిస్తూ కొందరు చేసిన వ్యాఖ్యలివి. నిజమే? దేశంలో నైపుణ్యానికి కొదవ లేదు. దేశవాళీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో 200కు పైగా ఆటగాళ్లు ఆడుతూ ఉంటారు. మరి వీరందరు ఎక్కడ? టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులోని బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. ఎంతలా అంటే.. కనీసం పసికూన జట్లయినా నెదర్లాండ్స్, నమీబియా […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా పోరాటం ముగిసింది. సూపర్ 12లో అద్భుతంగా ఆడిన భారత్.. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసి 168 పరుగుల మంచి టార్గెట్ సెట్ చేసిన టీమిండియా.. బౌలింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ టోర్నీలో పవర్‌ప్లేలో అద్భుతంగా పరుగులు రాబడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు.. సెమీస్‌లోనూ అదే ఊపును కొనసాగించారు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. జట్టులో […]
నవంబర్ 10, 2022 టీమిండియా క్రికెట్ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయింది. ఎన్నో ఆశలతో టీ20 ప్రపంచ కప్ కొట్టాలని భారత్ జట్టు ఆస్ట్రేలియ గడ్డపై అడుగు పెట్టింది. సూపర్ 12 మ్యాచ్ ల్లో అద్బుత ప్రదర్శన చేసి సెమీస్ కు కూడా చేరుకుంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజాలందరు టీమిండియానే కప్ కొట్టబోతోందని జోస్యం చెప్పారు. కానీ అందరి అంచనాలను వమ్ము చేస్తు.. సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఈ […]
సెమీస్‌లో టీమిండియా బొక్కాబోర్లా పడింది. సూపర్ 12లో 4 విజయాలతో సత్తా చాటిన రోహిత్ సేన.. కీలక సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. అసలు ఏ మాత్రం పసలేని బౌలింగ్‌ను ఇంగ్లండ్ ఓపెనర్లు చెడుగుడు ఆడుకున్నారు. దీంతో 15 ఏళ్ల నిరీక్షణకు ఈ వరల్డ్ కప్‌కు తెరపడుతుందని భావించిన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే మిగిలింది. టోర్నీ ఆరంభం నుంచి చెప్పుకుంటున్నట్లు టీమిండియా బౌలింగ్ ఎటాక్ వీక్‌గా ఉందనే విషయం సెమీస్‌తో తేటతెల్లమైంది. సూపర్ […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటికే సూపర్ 12లో మూడు హాఫ్ సెంచరీలతో 246 పరుగులు చేసి టోర్నీలోనే టాప్ రన్ స్కోరర్‌గా ఉన్న విరాట్.. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో సెమీస్‌లోనూ హాఫ్ సెంచరీతో సత్తా చాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేసిన కోహ్లీ.. క్రిస్ జోర్దాన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతికి ఆదిల్ రషీద్‌కి […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్‌లో చిత్తుగా ఓడింది. గురువారం అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. సూపర్ 12 స్టేజ్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 4 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన భారత్.. సెమీస్‌లో మాత్రం బొక్కా బోర్లా పడింది. ఏ మాత్రం ప్రభావం చూపని బౌలింగ్‌తో టీమిండియా తేలిపోయింది. ఈ వరల్డ్ కప్‌లో బెస్ట్ ఓపెనింగ్ జోడిగా […]