2022 టీ20 ప్రపంచ కప్ లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ ను మట్టికరిపించింది. దాంతో దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఒక రోజు ముందుగానే మెుదలైయ్యాయి. యావత్ భారతదేశం.. టీమిండియా ప్రపంచ కప్ గెలిచినంతగా సంబురాలు జరుపుకుంది. కానీ టీమిండియా ఆటగాళ్లు మాత్రం కనీసం కేక్ కూడా కట్ చేయలేదని సమాచారం. ఈ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని భావించిన యువ ఆటగాళ్లకు.. టీమిండియా కోచ్ ద్రవిడ్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ షాకిచ్చారు. దీపావళి డిన్నర్ ను ఏర్పాటు చేయగా చివరి నిమిషంలో ద్రవిడ్ సూచనలతో దానిని రద్దు చేశారు. ఈ క్రమంలోనే టీమిండియా ఆటగాళ్లకు ద్రవిడ్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను వరల్డ్ కప్ లో ఓడించడంతో దేశం మెుత్తం సంబరాలు చేసుకుంది. ఈ మేరకు సిడ్నీలో ఉన్న భారత దౌత్య అధికారులు టీమిండియా ఆటగాళ్లకు దీపావళి డిన్నర్ ను ఏర్పాటు చేశారు. కానీ సీనియర్ ప్లేయర్స్ అయిన విరాట్, రోహిత్ సూచనల మేరకు కోచ్ ద్రవిడ్ ఈ పార్టీని రద్దు చేశాడని.. భారత జట్టు సపోర్ట్ స్టాఫ్ సభ్యులు ఒకరు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు తెలిపారు. ఈ మేరకు ద్రవిడ్ మాట్లాడుతూ..”మన అంతిమ లక్ష్యం వరల్డ్ కప్ గెలవడమే. అప్పటి వరకు మీరు విశ్రాంతి తీసుకోవద్దు, మీ గురిని ప్రపంచ కప్ పైనే ఉంచండి. ఇది మనకు లభించిన గోప్ప ఆరంభం మాత్రమే. దానిని మనందరం సమష్టిగా చివరి వరకు కొనసాగిద్దాం. టోర్నీ అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడే మెుదలైంది. అంతే గాని మీరు పార్టీలు, సెలబ్రేషన్స్ అంటు టైమ్ ను వేస్ట్ చేయకండి. గ్రౌండ్ లో కఠోర శ్రమ చేస్తేనే మనకు ఫలితం వస్తుంది” అని ద్రవిడ్ ఆటగాళ్లకు క్లాస్ పీకినట్లు సపోర్టు స్టాఫ్ సభ్యుడు తెలిపాడు.
The reaction of Rahul Dravid after the thrilling victory against Pakistan 😍🔥#INDvsPAK pic.twitter.com/V1xA8Fak23
— Utsav 💙 (@utsav045) October 23, 2022
ప్రపంచ కప్ గెలిచేంత వరకు పార్టీలకు దూరంగా ఉండాలని ఆటగాళ్లకు ద్రవిడ్ సూచించాడు. వరల్డ్ కప్ గెలిచే వరకు ప్లేయర్స్ ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండరాదని పేర్కొన్నాడు. పాక్ తో మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టులో ని లోటుపాట్ల గురించి చాలా సేపు ఆటగాళ్లతో చర్చించినట్లు సదరు స్టాఫ్ సభ్యుడు తెలిపాడు. అనుకున్న లక్ష్యం పూర్తి అయ్యేంత వరకు మనిషికి అలసత్వం ఉండకూడదు. అప్పుడే మనం అనుకున్న లక్ష్యం.. మనం సాధించగలం. ఇక ప్రపంచ కప్ లో భారత్ తన రెండో మ్యాచ్ ను గురువారం నెదర్లాండ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే సిడ్నీ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో చమటోడుస్తున్నారు.
India vs Pakistan = True Emotions 🇮🇳
📸: Disney + Hotstar #indvspak #CricketTwitter pic.twitter.com/O0Cy1izjkv
— Sportskeeda (@Sportskeeda) October 23, 2022