టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో బుధవారం టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. సెమీస్ చేరే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాను ఒక భయకరమైన చెత్త రికార్డు కలవరపెడుతోంది. అదే ‘అడిలైడ్ 36’.. ఈ దారుణం జరిగి ఏడాది పైనే అవుతున్నా.. అడిలైడ్ అనగానే టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయిన ఘోరం క్రికెట్ అభిమానులు కళ్ల ముందు ఆవిషృతం అవుతోంది. టీమిండియాలో చాలా మంది యువ క్రికెటర్లు ఉన్నా.. ఆ దారుణ ఓటమిలో వారు భాగం కాకపోయినా.. ఆ ఓటమి తాలుకూ భయం వారిలో కూడా ఉంటుందని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
2020-21లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా.. అడిలైడ్‌లో ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా 36 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా చరిత్రలో ఇదే అత్యంత దారుణమైన టోటల్. ఇలాంటి భయంకరమైన ఓటమి ఎదురైన గ్రౌండ్‌లో మళ్లీ ఏడాది తర్వాత టీమిండియా మ్యాచ్ ఆడబోతుంది. కానీ.. ప్రత్యర్థి మాత్రం మారింది. ప్రత్యర్థి బలహీనమైనదే అయినా.. వారిని తక్కువగా అంచనా వేయలేం. వారిదైన రోజున పెద్ద పెద్ద జట్లనే ఓడిస్తారు. బంగ్లా చేతిలో ఓడిన అనుభవం మనకు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్‌కు సగర్వంగా చేరాలంటే మాత్రం ఈ మ్యాచ్ కచ్చితంగా గెలిచితీరాలి.
కానీ.. అడిలైడ్ 36 పీడకల నుంచి టీమిండియా బయటపడిందో లేదో ఇంకా తెలియదు. ఆ మ్యాచ్‌లో ఒక్కరు కూడా 10 పరుగులు చేయలేదు. 11 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం అయ్యారు. ఆ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్. తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసి భారత్.. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 200లోపే ఆలౌట్ చేసింది. కానీ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఊహకందని విధంగా 36 పరుగులకే ఆలౌట్ ఘోర అవమానాన్ని ఎదుర్కొంది. కానీ.. అడిలైడ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి మాత్రం మంచి రికార్డు ఉంది. అతను నిలబడితే బంగ్లాను ఓడించడం పెద్ద విషయం కాదు. పైగా అడిలైట్‌లో ఆసీస్‌తో ఆడిన ఏకైక టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది.
Words from Ravi Shastri at the mid-night during the discussion with Bharat Arun, Virat Kohli, Vikram Rathour after the famous 36 all-out at Adelaide:
“This 36, Wear it like a badge, Wear this 36 like a badge, This 36 is what will make this team great”
It turned out to be true. pic.twitter.com/YUZiZ3JMAr
— Johns. (@CricCrazyJohns) January 21, 2021
Predict Virat Kohli’s score tomorrow#ViratKohli𓃵 #INDvsBAN pic.twitter.com/hjbe5IQCuf
— Cricket_Enthusiast (@Hatedguy123) November 1, 2022