బంగ్లా గడ్డపై వన్డే సిరీస్ కోల్పోయిన భారత్, టెస్ట్ సిరీస్ నెగ్గి పరువు దక్కించుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టెస్టులో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుస వికెట్లు కోల్పోతూ.. పీకల మీదకు తెచ్చుకుంది. కేఎల్ రాహుల్(2), శుభమన్ గిల్(7), చతేశ్వర్ పుజారా (6), విరాట్ కోహ్లీ (1), రిషభ్ […]
బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. యువ ఆటగాడు శుభ్ మన్ గిల్(110) సెంచరీతో కదం తొక్కగా, సీనియర్ వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా(102) సైతం శతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్ లో 254 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్, సెకండ్ ఇన్నింగ్స్ లో 258 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లా ముంగిట 513 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది భారత్. దాదాపు 1443 రోజుల తరువాత […]
బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో భారత యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ద్విశతకం నమోదు చేసిన సంగతి తెలిసిందే. అది నుంచే బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన అతను కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ చేశాడు. 85 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్న ఇషాన్.. 126 బంతుల్లోనే ద్విశతకాన్ని నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం. ఫోర్లు, సిక్సుల ద్వారానే 146 పరుగులు వచ్చాయి. ఇదిలావుంచితే.. ఇషాన్ తాను ఔట్ కాకపోయి […]
బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. మొదటి రెండు మ్యాచుల్లో విఫలమైన భారత బ్యాటర్లు.. ఈ మ్యాచులో మాత్రం బంగ్లా బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు. మాజీ సారధి విరాట్ కోహ్లీ(113 నాటౌట్) సెంచరీ చేయగా, యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ డబులు సెంచరీ సాధించాడు. 85 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్న ఇషాన్.. 126 బంతుల్లోనే ద్విశతకాన్ని నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 23 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం. ఫోర్లు, […]
మూడు వన్డేల సిరీస్ లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసందే. ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లా వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది. చివరి వికెట్ కు మెహిదీ హసన్- ముస్తాఫిర్ రెహ్మాన్ జోడి 51 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించి బంగ్లాకు అద్భుత విజయాన్ని అందించారు. ఇక ఇరుజట్ల మధ్య డిసెంబర్ 7న అదే వేదికగా రెండో వన్డే జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లా కోచ్.. రస్సెల్ డొమింగో మీడియాతో […]
బంగ్లాదేశ్ పర్యటన భారత జట్టుకు కలిసొచ్చేలా కనిపించడం లేదు. అసలే మ్యాచ్ ఓడి బాధలో ఉంటే.. రాణిస్తారనుకున్న కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరిగా గాయాల పాలు అవుతున్నారు. ఇప్పటికే సీనియర్ పేసర్.. మహమ్మద్ షమీ గాయం కారణంగా టోర్నీకే దూరమవ్వగా.. తాజాగా, యువ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో శార్దుల్ ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం అతడు మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నాడు. వైద్యులు గాయాన్ని పరిశీలించిన తర్వాత అతడు […]
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుపై క్రికెట్ అభిమానులు కోపంగా ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోరపరాజయాన్ని చవిచూసింది. పసికూన బంగ్లాదేశ్‌పై టీమిండియా ఓడిపోవడాన్ని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆదివారం ఢాకా వేదికగా బంగ్లాతో తొలి వన్డే ఆడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. టాపార్డర్, లోయర్ ఆర్డర్ విఫలం అవ్వడంతో 41.2 ఓవర్లలో […]
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో బంగ్లా బౌలర్లు రెచ్చిపోతున్నారు. స్వదేశీ పిచ్చులు కావడంతో నిప్పులు చెరుగుతున్నారు. భారత టాపార్డర్ బ్యాటర్లయిన శిఖర్ ధావన్(7), రోహిత్ శర్మ(27), విరాట్ కోహ్లీ(9) లను స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాట పట్టించారు. దీంతో భారత జట్టు 49 పరుగలకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచులో బంగ్లాదేశ్ ఆటగాడు.. లిటన్ దాస్ మెరుపు ఫీల్డింగ్ చేశాడు. షార్ట్ ఎక్సట్రా కవర్ లో ఫీల్డింగ్ చేస్తున్న […]
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు రోహిత్ సేన సిద్ధమైంది. రేపు(ఆదివారం) ఢాకా వేదికగా తొలి వన్డేలో తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అలాగే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడిన రిషభ్ పంత్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ నుంచి నేరుగా బంగ్లాదేశ్ చేరుకుని జట్టుతో కలిశారు. కివీస్ పర్యటనలో లేని ఆటగాళ్లు […]
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టు సిరీస్‌లు ఆడేందుకు రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా బంగ్లాదేశ్ వెళ్లింది. శుక్రవారమే బంగ్లాదేశ్ చేరుకున్న భారత బృందం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. తిరిగి జట్టులో చేరారు. రేపు(ఆదివారం) ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో భారత్-బంగ్లా తొలి వన్డే ఆడనున్నాయి. ఇదే స్టేడియంలో రెండో వన్డే డిసెంబర్ […]