టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు చెలరేగి ఆడింది. 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 179 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 123 పరుగులకే పరిమితమయ్యింది. ఈ మ్యాచులో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ(53), విరాట్ కోహ్లీ(62), సూర్యకుమార్ యాదవ్(51)లు హాఫ్ సెంచరీలతో హోరెత్తిస్తే, బౌలర్లు అంతకుమించిన ప్రదర్శన చేశారు. నెదర్లాండ్స్ బ్యాటర్లకు కనీసం పోరాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా భువనేశ్వర్.. తన స్వింగ్ బౌలింగ్ తో నెదర్లాండ్స్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. తొలుత రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. పైగా ఒక వికెట్ పడగొట్టాడు.
భారత్‌కు దొరికిన విలువైన పేసర్ భువీ. చాన్నాళ్ల వరకు ఇండియాలో మీడియం పేసర్లే ఉండేవారు. వైవిధ్యం తక్కువ. అలాంటి టైమ్‌లో ఈ భువీ ఎంట్రీ ఇచ్చాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసేవాడు. తన తొలి మ్యాచులో పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ హఫీజ్ ను అవుట్ చేసిన తీరు అప్పట్లో ఓ సంచలనం. అయితే.. గాయం కారణంగా కొంత కాలం ఆటకు దూరమైన భువీ, ఈమధ్య కాలంలో అలాంటి ప్రదర్శన చేసింది లేదు. అయితే టీ20 వరల్డ్‌కప్‌లో గాడిలో పడినట్లు కనిపిస్తున్నాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో రెండు ఓవర్లను వేసిన భువి ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ రెండు కూడా మెయిడెన్ ఓవర్లే అయ్యాయి. పైగా ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఈ క్రమంలో ఓ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో వరుసగా రెండు ఓవర్లను మెయిడెన్‌గా సంధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
First Ball of Bhuvi in International Cricket pic.twitter.com/nzjPMz34zC
— Govardhan Reddy (@gova3555) October 27, 2022
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(53), విరాట్ కోహ్లీ(62), సూర్యకుమార్ యాదవ్(51)లు హాఫ్ సెంచరీలతో హోరెత్తించారు. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ తలా 2 వికెట్లు పడగొట్టగా, షమీ ఒక వికెట్ పడగాఊటాడు. ఇక భారత్ తదుపరి మ్యాచులో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 30న జరగనుంది.
Bhuvneshwar Kumar in the first 2 overs: 0,0,0,0,0,0,0,W,0,0,0,0.
— Johns. (@CricCrazyJohns) October 27, 2022
#TeamIndia make it 2️⃣ in 2️⃣ to move top of 𝐆𝐫𝐨𝐮𝐩 2️⃣ ✅✅#OneFamily #T20WorldCup #INDvNED @ICC @BhuviOfficial pic.twitter.com/dUwkcF1v6s
— Mumbai Indians (@mipaltan) October 27, 2022