మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శ్రీలంకను 2-1 తేడాతో టీమిండియా ఓడించి, సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఏక పక్షంగా సాగిన మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలుత రాహుల్ త్రిపాఠి తుపాన్ ఇన్నింగ్స్ ఆడితే.. తర్వాత సూర్య కుమార్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ.. కేవలం 51 బంతుల్లోనే 9 సిక్స్ లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య థండర్ ఇన్నింగ్స్ తో భారత్ 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లంక తడబడటంతో 91 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సెంచరీ హీరో సూర్య పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే సూర్య సెంచరీ చేయడంతో అభినందిస్తూ.. విరాట్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ షేర్ చేశాడు. దానికి సూర్య స్పెషల్ రిప్లై ఇచ్చాడు. ఆ వీడియోను తాజాగా బీసీసీఐ విడుదల చేసింది.
సూర్యకుమార్ యాదవ్ తుపాన్ సెంచరీతో శ్రీలంక జట్టును ముంచెత్తాడు. దాంతో టీ20 సిరీస్ ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో సూర్య కుమార్ బ్యాటింగ్ పై దిగ్గజాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా రన్ మెషిన్, కింగ్ విరాట్ కోహ్లీ సూర్య ఆటను పొగుడుతూ.. తన ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టాడు. అందులో “సూర్య భాయ్ నీ ఆటను తెగ ఎంజాయ్ చేశాను” అంటూ ఫైర్ ఎమోజీ పెట్టాడు. దాన్ని చూసిన సూర్య ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఆ తర్వాత విరాట్ పోస్ట్ కు రిప్లై ఇస్తూ..”థ్యాంక్యూ బ్రదర్ లాట్స్ ఆఫ్ లవ్, త్వరలోనే కలుద్దాం” అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ వీడియోను అంతా టీమిండియా ప్లేయర్ రికార్డు చేశాడు. దానిని బీసీసీఐ తాజాగా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ అనంతరం సిరీస్ గెలిచిన సందర్బంగా కేక్ ను కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆటగాళ్లను చూడ్డానికి అభిమానులు ఎగబడ్డారు.
Raw emotions 🎦
A Suryakumar fandom frenzy 👏🏻
A special reply to an Instagram story 😉
Unparalleled love for SKY from his fans as he signs off from Rajkot 🤗#TeamIndia | #INDvSL | @surya_14kumar pic.twitter.com/wYuRKMNv1L
— BCCI (@BCCI) January 8, 2023