భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20.. టీమిండియా ముందు 207 పరుగుల భారీ లక్ష్యం.. 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి మ్యాచ్ పై ఆశలు వదులుకుంది. కానీ అందరు ఊహించినట్లుగానే సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీని గుర్తుకు తెస్తు.. మరో యంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు సహచర ఆటగాళ్ల నుంచి సహకారం లేకుండా పెవిలియన్ కు చేరుతున్నప్పటికీ తనదైన మార్క్ గేమ్ తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో తన ఆటకు కాస్త భిన్నంగా ఆడినట్లు కనిపించాడు సూర్య భాయ్. 36 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు సూర్య. అయితే ఈ మ్యాచ్ లో ఓ చెత్త రికార్డును క్రియేట్ చేశాడు సూర్యకుమార్. అదేంటి ఇంత గొప్ప ఇన్నింగ్స్ ఆడినప్పటికీ చెత్త రికార్డు నెలకొల్పడం ఏంటి అని మీకు అనుమానం రావొచ్చు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
సూర్యకుమార్ యాదవ్.. గత కొంత కాలంగా టీమిండియాలో మారుమ్రోగుతున్న పేరు. సూర్య బ్యాటింగ్ కు దిగాడు అంటే.. ప్రత్యర్థి బౌలర్ కు చుక్కలు ఖాయమే.. అని రీసెంట్ గా అతడి ఫామ్ ను చూస్తేనే తెలుస్తుంది. గత కొంత కాలంగా కంటిన్యూస్ గా టీమిండియా కష్టాల్లో ఉన్న ప్రతీసారి.. ఆదుకుంటూ గొప్పగొప్ప విజయాలను అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీని గుర్తుకు తెస్తున్నాడు. అయితే కోహ్లీని గుర్తుకు తెచ్చేది పరుగుల్లో కాదు.. తనతో పాటుగా క్రీజ్ లో ఉండే అవతలి బ్యాటర్ చెలరేగుతుంటే.. సింగిల్స్ తీస్తూ, స్ట్రైక్ రోటేట్ చేయడం కోహ్లీకి అలవాటు. పరుగులు చేసే బ్యాటర్ కు ఎక్కువ స్ట్రైకింగ్ ఇవ్వాలి అన్నది కోహ్లీ ఉద్దేశం. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో కోహ్లీలా యాంకర్ పాత్ర పోషించాడు సూర్య భాయ్.
ఓ వైపు అక్షర్ పటేల్ లంక బౌలర్లపై విరుచుకుపడుతుంటే.. అతడికి అండగా నిలబడ్డాడు సూర్య. ఈ మ్యాచ్ లో కొన్నికొన్ని సార్లు తన ఆటకు విరుద్దంగా ఆడాడు సూర్యకుమార్. మంచి టచ్ లో ఉన్న అక్షర్ కే ఎక్కువ స్ట్రైక్ ఇవ్వడానికి చూశాడు SKY. సూర్య ఇచ్చిన సహకారంతో చెలరేగిపోయాడు అక్షర్ పటేల్. 31 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 65 పరుగులు చేశాడు అక్షర్. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం ఓ చెత్త రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు సూర్యకుమార్. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో రికార్డులు కొల్లగొడుతున్న సూర్య.. తాజాగా లంకతో జరిగిన మ్యాచ్ లో ఇప్పటి వరకు తన కెరీర్ లోనే తక్కువ స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు.
టీ20ల్లో సూర్య 50కి పైగా పరుగులు చేసిన మ్యాచ్ ల్లో.. తాజాగా లంకపై క్రియేట్ చేసిన141.67 స్ట్రైక్ రేటే సూర్య కెరీర్ లో అతి తక్కువ స్ట్రైక్ రేట్. గత ఇన్నింగ్స్ ల్లో సూర్య అర్ధశతకం సాధించిన ప్రతిసారి దాదాపుగా 190 నుంచి 250 స్ట్రైక్ రేటును మెయింటెన్ చేసేవాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం కేవలం 141.67 స్ట్రైక్ రేట్ ను నమోదు చేసి.. తన పేరిట చెత్త రికార్డును నెలకొల్పుకున్నాడు. అయితే 141 స్ట్రైక్ రేట్ ఏమీ తక్కువ కాదు.. మిగతా బ్యాటర్లు కంటిన్యూస్ గా ఇంత భారీ స్ట్రైక్ రేట్ ను నమోదు చేయలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. విజయానికి 16 పరుగుల దూరంలో ఆగిపోయి ఓటమి చవిచూసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసింది టీమిండియా.
Strike Rate of Suryakumar Yadav when he scored 50 or more in T20I:
183.8 sr
147.06 sr
155 sr
209.6 sr
212.7 sr
172.7 sr
261.5 sr
191.6 sr
151.5 sr
277.2 sr
204 sr
170 sr
244 sr
217.6 sr
141.67 sr— Johns. (@CricCrazyJohns) January 6, 2023