భారత్-ఆసీస్ మధ్య వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ధాటికి 117 పరుగులకే కుప్పకూలారు. దాంతో 20 ఏళ్లలో ఆసీస్ పై ఇదే చెత్తరికార్డుగా నమోదు అయ్యింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో తీసింది తక్కువ వికెట్లే అయినా చరిత్ర సృష్టించాడు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్. ఈ క్రమంలోనే మిస్టరీ స్పిన్నర్ అశ్విన్ కు సైతం సాధ్యం కాని రికార్డును సాధించి, బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు.
ఇప్పుడిప్పుడే టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న అక్షర్ పటేల్.. గత కొంత కాలంగా బౌలింగ్ లో విఫలమవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ మీద వికెట్ తీసుకున్న అక్షర్.. ఆ తర్వాత వికెట్ తీయడానికి ఏకంగా 47.4 ఓవర్లు బౌలింగ్ చేయడం గమనార్హం.
దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. రెగ్యులర్ కెప్టెన్ పంత్ యాక్సిడెంట్ లో గాయపడటంతో జట్టులో ఉన్న స్టార్ క్రికెటర్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారట.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పోరాడుతోంది. అయితే.. సిరీస్‌కు ముందు పంత్ లేడనే భయాన్ని తాజాగా ఓ ఆల్‌రౌండర్ తగ్గిస్తున్నాడు. పంత్‌లా ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతూ.. హేమాహేమీలు విఫలమైన చోట.. జట్టుకు ఆపద్బాంధవుడిలా మారుతున్నాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య మరికొన్ని గంటల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గురించి.. భారత మాజీ హెడ్ కోచ్, ప్రఖ్యాత కామెంటేటర్ రవిశాస్త్రి ప్లేయింగ్ 11లో ఎవరిని ఆడించాలి అనేదానిపై టీమిండియాకు ఒక కీలక సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా రవిశాస్త్రీ మాట్లాడుతూ.. భారత్ లాంటి ఉపఖండపు పిచ్‌లపై స్పిన్నర్లు చాలా కీలక పాత్ర పోషిస్తారని.. దీనికి సంబంధించి ప్లేయింగ్ 11లో స్పిన్నర్లలో ఎవరిని ఆడించాలి అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. […]
ప్రస్తుతం క్రికెటర్ల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఏ జట్టు వైపు చూసినా… క్రికెటర్ల పెళ్లి భాజంత్రీలు, వారి భార్యల ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఇన్నాళ్లు తీరికలేని క్రికెట్ తో బిజీ.. బిజీ.. లైఫ్ లీడ్ చేసిన ఆటగాళ్లు సమయం దొరకడంతో బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. కేఎల్ రాహుల్, అక్సర్ పటేల్, హ్యారిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, కసున్ రజిత, చరిత అసలంక, ప్రతుమ్ నిస్సంక.. ఇలా […]
టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరిగా శుభవార్తలు చెబుతూ ఉన్నారు. ఇటీవలే కేఎల్ రాహుల్- అతియా శెట్టి వివాహం చేసుకోగా.. ఇప్పుడు స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన మేహా పటేల్ కు మూడు ముళ్లు కట్టేశాడు. జనవరి 26న వడోదరాలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 2022లో అక్షర్ పటేల్ తన గర్ల్ ఫ్రెండ్ మేహాకి పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. జనవరి 20న వీళ్ల నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి […]
కోల్‌కత్తా వేదికగా గురువారం భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు అక్షర్ పటేల్. రవీంద్ర జడేజాకు రీప్లేస్‌మెంట్‌గా స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులో కొనసాగుతున్న అక్షర్.. ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటాడు. అయితే.. తాజాగా లంకతో రెండో మ్యాచ్‌లో తన ఫీల్డిండ్ విన్యాసంతో జడేజాను అన్ని విధాలా భర్తీ చేయగలను అంటూ.. చెప్పకనే చెప్పాడు. అక్షర్ పటేల్ పట్టిన ఆ క్యాచ్ చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి […]
శ్రీలంకతో రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన చివరి మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. సిక్స్ లు, ఫోర్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా సూర్య కుమార్ ఆట గురించి ఇక్కడ చెప్పుకోవాలి. సునామీ ఇన్నింగ్స్ ఆడిన సూర్య కేవలం 45 బంతుల్లోనే శతకంతో […]