క్రికెట్ లో ఓ బ్యాట్స్ మెన్ ఒక గేమ్ లో బాగా ఆడతాడు లేదా వరసుగా నాలుగైదు మ్యాచ్ ల్లో బాగా ఆడుతాడు. కానీ టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ మాత్రం ఇందుకు భిన్నం. దాదాపుగా గత కొన్నిరోజులుగా టీ20లో ఆడుతున్న ప్రతీ మ్యాచ్ లో దుమ్మురేపుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ నుంచి నిన్నటి శ్రీలంక సిరీస్ దాక తన బ్యాటింగ్ సత్తాను నిరూపిస్తూనే ఉన్నాడు. డషింగ్ బ్యాటర్ గా, మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడిగా సూర్యకుమార్ మంచి గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో టీమిండియా తరపున ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పటికే టీ20ల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న సూర్య తన స్థానాన్ని మరింతగా పదిలం చేసుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్.. వరల్డ్ వైడ్ గా మారుమ్రోగిపోతున్న పేరు. శరీరాన్ని విల్లులా వచ్చి షాట్స్ కొట్టడంలో సూర్యను మించిన ఆటగాడు లేడు అంటే అతిశయోక్తికాదు. ఇక అతడు బాదుడు మెుదలు పెడితే.. ప్రత్యర్థి బౌలర్లకు రక్తకన్నీరే. ఇక తన భీకరమైన ఫామ్ తో ఇప్పటికే టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో దూసుకెళ్తున్నాడు సూర్యభాయ్. ఇక తాజాగా ఐసీసీ సూర్యకుమార్ ఖాతాలో మరో రికార్డు! ఎవరికి సాధ్యం కాని రికార్డు సొంతం.. విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. తాజాగా విడుదలైన ఈ ర్యాంకింగ్స్ లో 908 రేటింగ్ పాయింట్స్ సాధించాడు సూర్య భాయ్. దాంతో 900 లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ పాయింట్స్ సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు SKY.
There’s no stopping Suryakumar Yadav 🔥
The India star is inching closer to eclipsing an all-time @MRFWorldwide ICC Men’s T20I Player Rankings record 👏https://t.co/VuhVmB7skR
— ICC (@ICC) January 11, 2023
అయితే టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో 900 రేటింగ్ పాయింట్స్ సాధించింది ఇద్దరే ఇద్దరు బ్యాటర్లు ఒకరు డేవిడ్ మలన్ అయితే.. మరోక ఆటగాడు ఆరోన్ ఫించ్. ఇప్పుడు వారి సరసన చేరాడు టీమిండియా 360 డిగ్రీస్ ప్లేయర్. ఇక టీ20 ర్యాంకింగ్స్ లో 836 రేటింగ్ పాయింట్లతో పాక్ బ్యాటర్ రిజ్వాన్ రెండో స్థానంలో ఉన్నాడు. డెవాన్ కాన్వే, బాబర్ అజమ్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక జాబితాలో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 631 రేటింగ్ పాయింట్లతో 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే టీ20ల్లో దుమ్మురేపుతున్న సూర్య భాయ్.. వన్డేలకు వచ్చేసరికి చతికీలపడిపోతున్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ లో సెంచరీ చేసినప్పటికీ.. లంకతో తొలి వన్డేలో మాత్రం చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.
Suryakumar Yadav has made a habit out of breaking records!
The India star inches towards yet another milestone 👊https://t.co/JoQeQZhy5v
— ICC (@ICC) January 12, 2023