భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రైనా తండ్రి త్రిలోక్‌చంద్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఘజియాబాద్‌లోని స్వగృహంలో ఆదివారం కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా ప్రాణాంతక క్యాన్సర్తో పోరాడుతూ.. నేడు తుది శ్వాస విడిచారు. త్రిలోక్ చంద్ గతంలో ఇండియన్ ఆర్మీలో సైనికాధికారిగా పనిచేశారు. సురేష్ రైనా పూర్వీకులది జమ్మూకాశ్మీర్ కాగా.. 1990ల్లో అక్కడ కాశ్మీర్ పండితుల ఊచకోత కారణంగా వారు కుటుంబతో సహా మురాదాబాద్ లో స్థిరపడ్డారు.
ఆ సమయంలో తనకు వచ్చే రూ.10వేల జీతంతో.. సురేశ్ రైనా క్రికెట్ కోచింగ్ ఫీజులను కట్టలేకపోయేవారు.1998లో లఖ్‌నవూలోని గురుగోవింద్ సింగ్ స్పోర్ట్స్ కళాశాలలో చేరాడు సురేశ్ రైనా. కశ్మీర్ ఉదంతం గురించి తన తండ్రికి జ్ఞాపకం తెచ్చే ఏ అంశాన్ని మాట్లాడకుండా ఎల్లప్పుడూ జాగ్రత్త పడేవాడినని రైనా గతంలోనే చెప్పాడు. రైనాను క్రికెటర్ ని చేయడంలో త్రిలోక్ చంద్ చాలా కృషి చేశారు. ఆయన మృతితో రైనా కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.ఇక, ఐపీఎల్ లో సురేష్ రైనాను మెగావేలంలోకి విడిచిపెట్టింది చెన్నై సూపర్ కింగ్స్ . సురేష్ రైనా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 205 మ్యాచ్‌లు ఆడాడు. 32.51 సగటుతో 5,528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో రైనా అత్యధిక స్కోర్ 100 పరుగులు. గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన రైనాన ‘చిన్న తలైవి’ గా గుర్తింపు పొందాడు.